Raja Singh: నా రాజీనామా ఆమోదానికి ఆ నలుగురే కారణం
Raja Singh(Image Credit: twitteer)
Political News

Raja Singh: నా రాజీనామా ఆమోదానికి ఆ నలుగురే కారణం

Raja Singh: తెలంగాణ బీజేపీ‌లో కొంత మంది దుష్ట శక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీ బీజేపీ(Bjp)లో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్నారు. తన రాజీనామా ఆమోదించేలా ఆ నలుగురు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజీనామాపై హై కమాండ్ ఎంక్వైరీ చేస్తారని అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. అమిత్ షా(Amit Shah) తనకు ఫోన్ చేశాడనే వార్తలో నిజం లేదన్నారు. టీబీజేపీలో జరుగుతున్న అన్యాయంపై బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా వచ్చినప్పుడు చెప్పానన్నారు.

 Also Read: Supreme Court: ఎఫ్​ఐఆర్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు

మర్యాద దొరకడం లేదు

అక్కడ ఎక్కువ సమయం దొరక్కపోవడంతో ఆయనకి పూర్తి విషయం చెప్పలేక పోయానని, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజీనామా చేశానని వెల్లడించారు. బీజేపీలో 11 ఏళ్లు తనను ఇబ్బందులు పెట్టిన భరించానని స్పష్టం చేశారు. ఇంకా ఎన్నేళ్లు భరించాలని, అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు. తనకే కాదని, బీజేపీలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస   ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే జితేందర్ రెడ్డి, విజయశాంతి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి నాయకులు బీజేపీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లారన్నారు. పార్టీలోకి తిరిగి రావాలని హై కమాండ్ ఆదేశిస్తే వెంటనే బీజేపీలో జాయిన్ అవుతానన్నారు.

ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదు

మాధవీలత(Madhavilatha)నాపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గోషామహల్(Gosha Mahal) లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ పార్టీ రాజీనామా చేయాలని ఆదేశిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. నేను వేరే పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు.. నేను హిందుత్వ అజెండా తో రాజకీయాలు చేసే వ్యక్తిని.. నా వాళ్ల పార్టీకి ఎప్పుడూ నష్టం జరగలేదని వెల్లడించారు. మహారాష్ట్ర , కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ కోసం ప్రచారం చేశానని, పార్టీ కన్నా నేను ఎక్కువ అని ఎప్పుడూ అనుకోలేదు అని తెలిపారు.

Also Read: Minister Seethakka: సమిష్టి కృషితో అభివృద్ధిలో జిల్లా నిలుపుదాం: మంత్రి సీతక్క

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..