Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022)కు సీక్వెల్‌గా, అవతార్ సిరీస్‌లో మూడవ చిత్రంగా 2025 డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో విడుదలవుతుంది. ఈ చిత్రంలో జేక్ సుల్లి (సామ్ వర్తింగ్టన్), నీటిరి (జో సల్దానా) కుటుంబం తమ కుమారుడు నెటెయామ్ మరణం తర్వాత దుఃఖంతో పోరాడుతూ, పాండోరాపై కొత్త, దూకుడైన నా’వి తెగ అయిన అష్ పీపుల్‌ను, వారి నాయకురాలు వరాంగ్ (ఓనా చాప్లిన్) నేతృత్వంలో ఎదుర్కొంటారు. వీరు ఎయ్వా మార్గాలను తిరస్కరిస్తారు. ఈ చిత్రం దృశ్యపరంగా అద్భుతంగా ఉంటూ, లావా ప్రవాహాలు, అగ్నిపర్వత భూభాగాలు, ఆకాశ యుద్ధాలు, కొత్త జీవులతో నిండి ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ జూలై 29, 2025న విడుదలై, అభిమానుల నుండి గొప్ప స్పందన పొందింది. ఈ సినిమా 3 గంటలకు పైగా నిడివి కలిగి ఉంటుందని, సిరీస్‌లో అత్యంత పొడవైన చిత్రంగా నిలుస్తుందని సమాచారం. ఇందులో ’మీ అమ్మోరి శక్తులేవీ మాకాడ పనిచెయ్యవ్’ అంటూ సాగిన వచ్చిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read also- Viral Video: విచిత్ర ప్రమాదం.. రివర్స్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు..!
మొదటి చిత్రం ‘అవతార్’ (2009), జేక్ సుల్లి (సామ్ వర్తింగ్టన్) అనే వికలాంగ మాజీ మెరైన్‌ను పాండోరాకు పంపడం ద్వారా పరిచయం చేస్తుంది. అక్కడ అతను నావి తెగలో చేరి, నీటిరి (జో సల్దానా)తో ప్రేమలో పడతాడు. మానవుల దురాశకు వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2.92 బిలియన్ డాలర్లు సంపాదించి, అత్యధిక వసూళ్ల చేసి రికార్డు నెలకొల్పింది. రెండవ చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022), జేక్, నీటిరి కుటుంబం మెట్కాయినా తెగతో కలిసి సముద్ర సంబంధిత సాహసాలను అన్వేషిస్తూ, కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) పగతో ఎదుర్కొంటుంది, ఈ సినిమా2.32 బిలియన్ డాలర్లు సంపాదించింది. మూడవ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (డిసెంబర్ 19, 2025), యాష్ పీపుల్ అనే కొత్త నావి తెగ, వారి నాయకురాలు వరాంగ్ (ఓనా చాప్లిన్)ను పరిచయం చేస్తూ, లావా భూభాగాలు, ఆకాశ యుద్ధాలతో జేక్ కుటుంబ ప్రయాణాన్ని చూపిస్తుంది.
Read also- Kangana Ranaut: కంగనా రనౌత్ అంటే పవన్ కళ్యాణ్ కి అంత ఇష్టమా?
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ లో పరిచయం చేయబడిన యాష్ పీపుల్, జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్‌లోని పాండోరా గ్రహంలో నివసించే ఒక కొత్త తెగ. ఈ తెగ ట్రైలర్‌లో చూపినట్లుగా లావా ప్రవాహాలు, అగ్నిపర్వత భూభాగాలతో నిండిన కఠినమైన వాతావరణంలో నివసిస్తుంది, వారి నాయకురాలు వరాంగ్ (ఓనా చాప్లిన్ నటించినది) నేతృత్వంలో ఉంటుంది. అష్ పీపుల్ ఎయ్వా (నా’వి ఆధ్యాత్మిక దేవత) మార్గాలను తిరస్కరిస్తూ ఇతర నావి తెగలతో విభేదిస్తారు, ఇది జేక్ సుల్లి, నీటిరి కుటుంబంతో ఘర్షణకు దారితీస్తుంది. వారు యుద్ధోన్మాద సంస్కృతిని కలిగి ఉన్నట్లు సూచించబడింది, ట్రైలర్‌లో ఆకాశ యుద్ధాలు, యాక్షన్ దృశ్యాలలో కనిపిస్తారు. ఇది ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫై చేసేలా ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి వరకూ వచ్చిన రెండు సినిమాలను మించి ఉండేలా ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.