Kangana Ranaut: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్‌లో భాగంగా హాటర్‌ఫ్లైతో జరిగిన రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో, బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకొణె, కృతి సనన్, కియారా అద్వానీలతో పోల్చినప్పుడు, పవన్ కళ్యాణ్ కంగనా రనౌత్‌ను తన ఆదర్శ సహనటిగా ఎంచుకున్నారు.
అలాగే, కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలతో పోల్చినప్పుడు కూడా ఆయన కంగనానే ఎంచుకున్నారు. కంగనా రనౌత్ తన ఇటీవలి చిత్రం ‘ఎమర్జెన్సీ’ లో ఇందిరా గాంధీ పాత్రలో చేసిన నటన ఆయనను ఎంతగానో ఆకట్టుకుందని, “ఆమె ఇందిరా గాంధీ పాత్రను అద్భుతంగా పోషించింది, నేను బలమైన నటితో పనిచేయాలనుకుంటే కంగనానే ఎంచుకుంటాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, కంగనాతో పోల్చినప్పుడు దివంగత నటి శ్రీదేవిని ఎంచుకున్నారు. “ఇక శ్రీదేవిని అయితే నేరుగా ఎంచుకుంటాను” అని నవ్వుతూ చెప్పారు.
Also Read: Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్
ఈ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూను కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేస్తూ, ” ప్రేమ ఎమోజీలతో తన కృతజ్ఞతను తెలిపింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తెలుగు నటుడు తనను ప్రశంసించడంతో ఆమె సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అభిమానులు కూడా కంగనా రనౌత్ నటన గురించి మాట్లాడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ
పవన్ కళ్యాణ్ ఇంత వరకు బాలీవుడ్ గురించి మాట్లాడింది కూడా లేదు. అయితే ఎప్పటి నుంచో ఫ్యాన్స్ తెలుసుకోవాలన్న ప్రశ్నలకు జవాబులు దొరికాయి. అయితే, పవన్ తన వ్యక్తిగత విషయాల గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ర్యాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. అలాగే, బాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరోయిన్ పేరు కూడా చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?