kingdom-song(image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Kingdom: రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కింగ్డమ్’ సాంగ్..

Kingdom: ‘కింగ్డమ్’ సినిమా నుంచి విడుదలైన పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.‘రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే’ అంటూ మెదలయ్యే పాట అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పించింది! అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా, కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను సిద్ధార్థ్ బస్రూర్, అనిరుధ్ ఆలపించారు. “పద పద.. శత్రువు బెదిరేలా.. దెబ్బకు గెలిచేలా..” వంటి సాహిత్యం యుద్ధ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. Xలో అభిమానులు దీన్ని చార్ట్‌బస్టర్‌గా, ఆల్బమ్‌లోని అంటూ పొగుడుతున్నారు. విజయ్ దేవరకొండ హావభావాలు, హై ఎనర్జీ విజువల్స్‌తో ఈ పాట సినిమాకు హైప్‌ను పెంచింది. ఈ పాటతో హిట్ ఖాయం అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయిదే మరికొందరు మాత్రం ఈ పాట్ దేవర టైటిల్ సాంగ్ ని పోలి ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పాట ఇంటర్ నెట్ లో సంచలనం సృష్టిస్తొంది.

Read also- World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?

ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన కొన్ని లిరిక్స్ ను నిర్మాత ప్రీ రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘మృత్యువు జడిసేలా పద పద, శత్రువు బెదిరేలా పద పద, గర్జన తెలిసేలా పద పద, దెబ్బకు గెలిచేలా పద పద’ అంటూ నిర్మాత తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ‘ఎంకన్న సామి అనుగ్రహిస్తే లాప్ లో పోయి కూసుంటా’ అన్న విజయ్ దేవరకొండ మాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న ప్రతి ప్రచారం చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని నింపుతున్నాయి. వీటన్నింటినీ చూసిన అభిమానులు ఈ సారి విజయ్ దేవరకొండకు హిట్ ఖాయం అంటూ కితాబిస్తున్నారు.

Read also- Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ

రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్‌’ జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పై యాక్షన్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో భాగంగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, గౌతమ్‌ తిన్ననూరి కలిసి ముచ్చటించిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

KTR: జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం: కేటీఆర్

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం