Sathi Leelavathi : లాంగ్ గ్యాప్ తీసుకుని లావణ్య త్రిపాఠి కొత్త సినిమాతో ‘సతీ లీలావతి’ తో మన ముందుకు వస్తుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విడుదలైంది. ఈ చిత్రంలో లావణ్యతో పాటు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సత్య తాటినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమ, కామెడీ , డ్రామా ఎలిమెంట్స్‌తో నిండిన ఒక ఫన్ రైడ్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
టీజర్‌లో లావణ్య, దేవ్ మోహన్ మధ్య సన్నివేశాలు ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంటాయని, సినిమా వినోదాత్మకంగా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?
ఈ సినిమా కథ ఏంటంటే..
లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటుంది. అయితే..కొన్నాళ్ళు ఇద్దరూ హ్యాపీగానే ఉంటారు. అయితే, ఒక రోజు ఏమైందో తెలియదు గానీ.. దేవ్ మోన్‌ను లావణ్య కొడుతోంది. మొత్తంగా టీజర్ నవ్వులు పూయిస్తుంది. హ్యాపీగా సాగుతున్న లైఫ్ లో భార్య భర్తల లైఫ్ లో గొడవలు మొదలవుతాయి. జాఫర్, మొట్ట రాజేంద్రన్, వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు? అసలు వీరి మధ్య గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.
Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ
టెక్నీకల్ టీం
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్స్: దుర్గాదేవి పిక్చర్స్
నిర్మాత: నాగ మోహన్
దర్శకత్వం: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
Also Read: MLA Nayini Rajender Reddy: వందకు వంద శాతం కుటుంబం అంతా జైలుకే: నాయిని రాజేందర్ రెడ్డి
నటీనటులు : లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు