Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కుటుంబంలోని అందరూ పెద్ద స్టార్లే. స్టార్ కాని వారు కూడా సెలబ్రిటీల కంటే తక్కువ కాదు. ఇక ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్ తన ఇంటి విషయాలను బయటకు వెల్లడించడంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. అభిషేక్ బచ్చన్ ఇంట్లో ఎక్కువగా ఎవరికి భయపడుతున్నాడనే దాని గురించి నమ్మలేని నిజాలను చెప్పింది.
Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ
అభిషేక్ బచ్చన్ ఎవరికి భయపడుతున్నారు?
కరణ్ జోహార్ తన షోలో షాకింగ్ ప్రశ్నలు అడుగుతాడనే విషయం మనకీ తెలిసిందే. ఇంట్లో ఎవరికి నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అని అభిషేక్‌ను అడిగాడు. అభిషేక్ బచ్చన్ అమ్మ అని చెప్పకముందే, శ్వేతా వెంటనే ‘భార్య’ అని చెప్పింది. దీంతో, అందరూ నవ్వడం మొదలు పెట్టారు. శ్వేతా బచ్చన్ ఇలా లీక్ చేసేదేంటని అక్కడున్న వారు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియో పాతది అయిన ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read: War2: ట్రైలర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వకూడదనే ఐడియా ఎవరిదో తెలుసా?
విడాకులు వార్తలు నిజమేనా?
కొన్ని నెలల క్రితం అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ ఒకరినొకరు విడాకులు తీసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఐశ్వర్య రాయ్ తన అత్తమామల ఇంటిని వదిలి వేరే చోట ఉంటుందని వెల్లడైంది. అయితే, కట్ చేస్తే ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో కుటుంబ సభ్యులు కలిసి కనిపించారు. అభిషేక్ ఐశ్వర్య కలిసి ఉన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే,అభిషేక్ విడాకులకు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.