HariHara VeeraMallu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Harihara Veeramallu: హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై స్పందించిన దర్శకుడు జ్యోతి కృష్ణ

Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ నటించిన హీరోగా నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ జులై 24, 2025న విడుదలైంది. అయితే, సినిమాలో కొన్ని మైనస్ లు ఉండటంతో ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా VFX, స్క్రీన్‌ప్లే లోపాలపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే, నిర్మాతలు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించి, మళ్లీ కొత్త వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ మార్పుల్లో గుర్రపు స్వారీ సన్నివేశాలు, బాణం సన్నివేశం, ఫ్లాగ్ సన్నివేశం, తుఫాను సన్నివేశాలను VFX లో రీ ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మార్పుల తర్వాత సినిమా అవుట్ ఫుట్ బావుందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఘోరంగా ట్రోల్స్ వస్తున్నా సరే.. డైరెక్టర్ ఇంత వరకు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఇక ఆయన ఏం అనుకున్నాడో మరి   హరిహర వీరమల్లు వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్ పై దర్శకుడు జ్యోతి కృష్ణ స్పందించాడు.

Also Read: War2: ట్రైల‌ర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఐడియా ఎవరిదో తెలుసా?

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజైన తర్వాత వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యతపై విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇక తాజాగా సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ స్పందిస్తూ, కొన్ని షాట్స్ నాణ్యత పరంగా సరిగ్గా లేవని తాము గుర్తించామని, అయితే సినిమా కథ, స్క్రీన్‌ప్లేలపై ఎవరూ విమర్శలు చేయలేదని అన్నారు. సినిమాపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని, ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్లుగా ఈ సినిమా నిర్మాణంలో ఉందని, కోవిడ్-19 మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల ఆలస్యం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ, వీఎఫ్ఎక్స్ విమర్శలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని సన్నివేశాలను తొలగించి, సినిమా కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Harihara Veeramallu: ఇదేదో ముందే చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా.. నిర్మాత పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?