Auto Union: షోరూం యజమానులు, డీలర్లు , ఫైనాన్షియర్లు ఇప్పటి వరకు చేసిన అక్రమ ఆటో లాగిన్ రద్దు చేయాలని, వెంటనే ప్రెష్ గా రవాణా శాఖ ఆటో లాగిన్ చేపట్టాలని బీపీటీఎంఎం(BPTMM) అఖిల భారత ప్రధానకార్యదర్శి అల్లూరి రవిశంకర్(Ravi Shankar) డిమాండ్ చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని ఎస్టీఏ కార్యాలయం ఎదుట సోమవారం బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ ,డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా ఫైనాన్స్
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కొత్త ఆటో ఎవరిపేరున అయితే లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అవుతుందో వారు 5 ఏళ్లు ఆటో అమ్ముకోకుండా, వేరే పేరున బదిలీ చేయకుండా వెంటనే ఉత్తర్వులు జారి చేయాలన్నారు. అధిక ధరలకు ఆటో బ్లాక్ లో అమ్మే డీలర్లు , ఫైనాన్షియర్ల పై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా ఫైనాన్స్ నడుపుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ఆటో(Auto)లను బ్లాక్ చేసి ఫైనాన్షిర్ల గుప్పిట్లో ఉంచిన షోరూంలపై చట్టపరమైన విచారణ చేపట్టి వారి వ్యాపార లైసెన్స్ లను రద్దు చేయాలన్నారు.
Also Read: Haridwar Stampede: మానస దేవి ఆలయంలో ఘోర విషాదం.. ఏడుగురి మృతి
యూనియన్ పేరుతో దళారులు
అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆటోలు అందే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయాలలో యూనియన్ పేరుతో వచ్చే దళారులను వెంటనే నిలిపి వేయాలని కోరారు. జాతీయ బ్యాంకుల ద్వారా ఆటో డ్రైవర్లకు ఆటో లోన్ వచ్చే విధంగా తమరు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నంద కిషోర్, ఉపాధ్యక్షుడు ఎండీ హబీబ్, ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్య గౌడ్, శ్రీధర్ రెడ్డి, వి.సమ్మయ్య యాదవ్, శ్రీనివాస్, కిషన్, అశ్విన్ రాజు, గిరి, బాబురాజ్ , రాములు, సాయిలు, జె.పరశురాం, వజ్రాలింగం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Thai Vs Cambodia: ట్రంప్ చెప్పినా తగ్గని థాయ్‌లాండ్, కాంబోడియా