Kaantha Teaser: ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) చిత్రంతో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. అంతకు ముందు ఆయన చేసిన ‘మహానటి’ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలు ఆయనని తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేలా చేశాయి, కానీ ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో తెలుగులోనూ ఆయనకు ఓ మార్కెట్ అంటూ క్రియేటంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ చిత్రం ‘కాంత’ (Kaantha). టైటిల్‌తోనే అందరినీ ఆకర్షించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేసుకుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) కీలక పాత్ర పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు సోమవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (HBD Dulquer Salmaan)
Also Read- War2: ట్రైలర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వకూడదనే ఐడియా ఎవరిదో తెలుసా?
ఈ టీజర్ ఈ సినిమా ఎలాంటి కథతో రూపుదిద్దుకుందనే విషయాన్ని క్లారిటీగా చెప్పేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో పిక్చర్ చూపిస్తూ.. సముద్రఖని, దుల్కర్ సల్మాన్ మధ్య ఉన్న ఓ ఫైరింగ్ వాతావరణాన్ని ఈ టీజర్ తెలియజేస్తుంది. ఈ టీజర్‌తో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇందులో వెర్సటైల్ యాక్టర్ చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య కెరీర్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత.. ఆ తర్వాత క్రమంగా వారికి వచ్చే పేరు, ప్రఖ్యాతులతో ఎలా చీలిపోయింది? అయ్య తన మొదటి హర్రర్ చిత్రం ‘శాంత’ను శక్తివంతమైన కథానాయిక చుట్టూ రూపొందిస్తుండగా.. స్టార్ అయిన చంద్రన్ క్రమంగా ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి, తనకు నచ్చినట్లుగా ఎలా మార్చేసుకున్నాడు? అతను తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చి.. అలాగే టైటిల్‌ను ‘శాంత’ కాదు.. ‘కాంత’ అని మార్చేసినట్లుగా ఈ టీజర్‌లో చూపించారు.
ఇందులో ప్రతి సన్నివేశం కళ్లార్పకుండా చూసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. మరీ ముఖ్యంగా 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ ఎమోషనల్ ఇంటెన్సిటీతో కట్టిపడేస్తుండటం విశేషం. సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ అప్పటి కాలంను గుర్తుకు తెస్తున్నాయి. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కథను డిజైన్ చేసిన తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దుల్కర్ సల్మాన్ తన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకోగా, సముద్రఖని ఒక వెటరన్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించి, పాత్రలో జీవించేశారు. ఇంక అందంతో భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్రను ప్రదర్శించింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. సినిమాపై అంచనాలను పెంచేలా ఈ టీజర్ ఉంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ఈ టీజర్‌లో తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు