Medical Colleges: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా విద్యార్ధులకు స్టైఫండ్ ఇవ్వడం లేదనే అంశంపై ఈ నిర్ణయం తీసుకున్నది. గతంలోనే అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వివరణ తీసుకున్నది. సుమారు 17 అంశాలపై వివరాలు సేకరించిన సర్కార్, ఆయా కాలేజీలు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదు. 50 శాతానికి పైగా కాలేజీలు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తన ఇంటర్నల్ ఎంక్వయిరీ ద్వారా గుర్తించింది. దీంతోనే విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు కాళోజీ వర్సిటీకి కూడా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రైవేట్ కాలేజీలు ఉండగా, ఇందులో 4 కాలేజీలు మినహా మరే కాలేజీలూ సరైన నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వం నిర్ధారించింది. స్టైఫండ్ ఇవ్వకపోవడంతో పాటు అకాడమిక్, క్లినికల్ రూల్సేవీ పాటించడం లేదు. ఇటీవల కొందరు పీజీ స్టూడెంట్లు నేరుగా విజిలెన్స్‌కు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. సూరారంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీపై ఓ దఫా విజిలెన్స్ వెరిఫికేషన్ చేసింది. ఆ కాలేజీ విజిట్‌లో తేలిన తప్పిదాలు చూసి, మిగతా ప్రైవేట్ కాలేజీలన్నింటిపై రెయిడ్స్ తప్పనిసరిగా అంటూ ప్రభుత్వానికి వివరించింది. ప్రభుత్వం నుంచి కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ రావడంతో తనిఖీలకు సిద్ధమైనది. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సర్కార్ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది.
అనుమతులు రద్దు!
ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అఫిలియేషన్ సర్టిఫికేట్ కాళోజీ వర్సిటీ ఇస్తుండగా, ఎస్టేన్సియాలిటీ(ఈసీ)ను ప్రభుత్వం ఇస్తుంది. ఆయా కాలేజీలకు తప్పిదాలు, నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సర్టిఫికేట్లను రద్దు చేసే ఛాన్స్ ఉన్నది. ఆ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆటోమెటిక్‌గా ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేసే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్టైఫండ్ ఇవ్వని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోనున్నది. స్టైఫండ్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ ఎన్ఎంసీ రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఎన్ఎంసీ ఛైర్మన్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అత్యుత్సాహంతో విద్యార్ధులకు స్టైఫండ్‌ను అందజేయడం లేదు. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఐదు వేలు చొప్పున ఇచ్చి చేతులు ఎత్తేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు స్టైఫండ్‌ను విద్యార్ధుల అకౌంట్లలో వేసి, ఆ తర్వాత వెంటనే డ్రా చేస్తున్నట్లు తెలిసింది. యూజీ, పీజీ రెండు విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. దీంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Read Also- NIMS Fire Incident: అగ్నిప్రమాదంపై ఆధారాలు లేవా? దర్యాప్తుపై అనుమానాలు
స్టూడెంట్స్‌కు బెదిరింపులు
స్టైఫండ్ అడుగుతున్న విద్యార్ధులను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఎంక్వైయిరీలోనూ ఇదే తేలింది. విద్యార్ధుల స్టేట్మెంట్లను కూడా సర్కార్ రికార్డు చేసింది. ఆయా కాలేజీల్లో ప్రజాప్రతినిధుల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉండటం గమనార్హం. పేషెంట్ కేర్, క్లినికల్ ఫెసిలిటీస్, బయోమెట్రిక్ అటెండెన్స్, లేబర్ వెల్ఫేర్, బ్లడ్ బ్యాంక్, ఫ్యాకల్టీ, ఎఫ్ఎంజీ ఇంటర్న్స్, ఫీజుల వివరాలు, స్టైఫండ్, ఆరోగ్య శ్రీ అమలు, డేష్ బోర్డు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కమిటీ, సేప్టీ కమిటీలు, లైంగిక వేధింపుల కమిటీ, సీసీ కెమెరాలు, ఓపీ, ఐపీ, సర్జరీలు, డెలివరీలు, ఎక్స్‌రేలు, ఆల్ట్రా సౌండ్, సీటీ, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు తప్పనిసరిగా మెయింటెన్ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ స్పష్టంగా చెప్పినా, ప్రైవేట్ కాలేజీలు పాటించడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పాత పద్ధతులనే అవలంభిస్తున్నాయి. దీంతోనే ప్రభుత్వం సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది.
Read Also- Samantha: ఆ విషయంలో ఇద్దరికీ పెద్ద గొడవ.. రాజ్ కి బ్రేకప్ చెప్పనున్న సమంత?