MYVILLAGE-SHOW( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

My Village Show Anil: ఓటీటీలోకి తెలంగాణ ప్రేమ కథ.. నవ్వించేది ఎప్పుడంటే?

My Village Show Anil: ‘మై విలేజ్ షో’ తో బాగా పాపులర్ అయిన అనిల్ తన సహజమైన నటన, తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట శివన్నారెడ్డి రూపొందించిన ఈ షోలో భాగంగా చిన్న చిన్న కామెడీ స్కిట్లలో నటిస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా విస్తృత గుర్తింపు పొందిన అనిల్, కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.

Read also- MBBS Fees: రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్.. ఏ దేశంలో ఎంబీబీఎస్ ఫీజు తక్కువ?

‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌ను ఆద్యంతం వినోద భరితంగా మలిచారని అర్థం అవుతోంది. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఎమోషనల్ డెప్త్‌ను కూడా చూపిస్తోంది.

Read also- Vishwambhara: ఆ పాట కాంట్రవర్సీపై స్పందించిన విశ్వంభర డైరెక్టర్.. అందుకేనా అలా చేసింది

ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌లో అనిల్ గీలా, వర్షిణి, మురళీధర్, సదానందం, సుజాత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఆధ్యంతం కామెడీతో సాగే కథలా కనిపిస్తుంది. దీంతో ఈ సిరీస్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఇద్దరు మధ్యజరిగే భూ వివాదం వారికి సంబంధించి వారి ప్రేమను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలంటే ఆగస్టు 8 వరకూ వేచిఉండాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారంలోనే రూ.188 కోట్లు రిలీజ్!

Foreign Cars Smuggling Case: లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. తెరపైకి కేటీఆర్ పేరు.. లిస్టులో అందరూ ప్రముఖులే!

Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!