Thummala Nageswara Rao ( IMAGE credit: swetcha reporter)
తెలంగాణ

Thummala Nageswara Rao: జాతీయ చేనేత దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

ThummalaNageswara Rao: నేతన్నల సంక్షేమం కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, భరోసా, భద్రతా పథకాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆదేశించారు. సచివాలయంలో చేనేత జౌళిశాఖ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేపట్టబోయే వేడుక ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Also  Read: Thummala Nageswara Rao:కేంద్రమంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ

ఈ సందర్భంగా మంత్రి (Thummala Nageswara Rao)మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో పట్టు, కాటన్, చేనేత వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటితరం యువత కూడా చేనేత ఉత్పత్తులను ఆదరిస్తున్నారన్నారు. చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని, సంప్రదాయ చేనేతలైన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, ఆర్మూర్ పితాంబరీ, మహదేవ్ పూర్ టస్సర్ పట్టుచీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్ షీట్లు, ఆలంపూర్ టవల్స్, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచాయన్నారు.

చేనేత రుణమాఫీ

వీటిని కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వస్త్ర ప్రదర్శనలో ఆయా చేనేత సంఘాల ద్వారా ప్రదర్శించాలని మంత్రి(Thummala Nageswara Rao) సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా, మార్కెట్లో పోటిపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేనేత రుణమాఫీ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, వారి ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ చేయాలన్నారు. ఇందిరా క్రాంతి మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరలను పరిశీలించి, వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ఇండెట్ల ప్రకారం వస్త్రాల, మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు నిరంతరం పని కల్పించడం జరుగుతోందన్నారు.

Also Read: Ramachandra Rao: బీఆర్ఎస్ పాలమూరు జిల్లాకు చేసిందేమి లేదు: రామచందర్ రావు

Just In

01

Maganti Family Issue: సునీత వల్లే బిడ్డను కోల్పోయా.. కేటీఆర్ వెంటపడ్డా పట్టించుకోలేదు.. మాగంటి తల్లి మహానంద కుమారి

Sabarimala Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. 60 స్పెషల్ ట్రైన్స్.. బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ప్రచారంలో.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?

BRS Party Surveys: అంతా ఫేక్.. మౌత్ టాక్‌తో గట్టెక్కాలని గులాబీ మాస్టర్ ప్లాన్..!

Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్