China Piece Movie: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ ను చూస్తుంటే యూనిక్ స్పై డ్రామా బాగా ఫలించినట్లు కనిపిస్తుంది. కామెడీ టైమింగ్స్ అయితే చాలా బాగా కుదిరాయి. టీజర్ లో రఘుబాబు చెప్పినట్లుగా అందరినీ ఇంప్రస్ చేసేలా ఉంది. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
read also- Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై రేగిన దుమారం.. పోలీసులకు ఫిర్యాదు
టీజర్ రిలీజ్ తర్వాత హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘టీమ్ అందరితో కలిసి ఈ టీజర్ ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. నేను ఈవెంట్ కి రావడానికి కారణం నిహాల్ టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయాలనే ఆరాటం నాకు చాలా నచ్చింది. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు నిహాల్ సూర్య వీళ్ళందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. ఒక కొత్త ఫిలిం మేకర్స్ కొత్త నటీనటులు ఉన్నపుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచనని చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా’ అని అన్నారు.
read also- Bandi Sanjay: హుస్నాబాద్‌లో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తాం: బండి సంజయ్
డైరెక్టర్ విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ.. ‘మేము చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాని తేరకెక్కించాము. కమల్ కూడా ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్’ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం.’ అని అన్నారు. హీరోలు నిహాల్, సూర్య శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ‘నేను జగడంతో పాటు దాదాపు 20 సినిమాలు కి చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను. అవన్నీ కూడా స్కూల్ బంక్ కొట్టడానికి చేశాను. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చింది. ఒక నమ్మకంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలుకని దానికి 100 శాతం కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది.’ అని అన్నారు.