Kingdom: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్’ జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పై యాక్షన్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read also- Viral News: తాగకుండానే బస్ డ్రైవర్‌కు ఆల్కాహాల్ పాజిటివ్.. ఎంక్వైరీ చేస్తే!
‘అర్జున్‌రెడ్డి’ ఇచ్చిన కిక్ ఎలాంటిది అంటే ఆ సినిమాలాగే అన్నీ అన్నీ హిట్ అవుతాయని ఓ సినిమా రిలీజ్ ఈవెంట్ లో పందెం కాసేవాడిని. కానీ, సినిమాలు చేస్తున్న కొద్దీ అర్థమైందేంటంటే, ఏది హిట్ అవుతుందో.. ఏది కాదో.. శుక్రవారం మూవీ విడుదలయ్యే వరకూ నాకే కాదు, ఎవరికీ తెలియదు. షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సీన్ ఆస్వాదిస్తూ చేస్తే అది ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకునేవాడిని. కానీ అది నిజం కాదని లేటుగా తెలిసింది. ఒక మూవీ విజయం సాధించాలంటే చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. సినిమా రంగాన్ని గౌరవించే వాళ్లతోనే సినిమా చేయడానికి ఇష్టపడతాను. అలాంటి వారిలో గౌతమ్ ఒకరని నేను భావించాను. అందుకే ఒకరోజు గౌతమ్‌కు కాల్ చేసి, ‘నా దగ్గర కథేమీ లేదు. నువ్వు స్క్రిప్ట్ చెప్పు సినిమా చేద్దాం’ అన్నాను. ‘గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు బ్రదర్స్. వాళ్ల చుట్టూ జరిగే సంఘర్షణే ఈ కథ’ అనే ఐడియా చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం సినిమా నా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ నలుగురి చేతుల్లోనే ఉంది. అందుకే నేను జై గౌతమ్, జై అనిరుధ్ , జై నవీన్ నూలీ, జై శ్రీరామ్ (దేవుడు) అంటున్నాను’ అని విజయ్ దేవరకొండ అనన్నారు.
Read also- Rahul Gandhi: రాజకీయ జీవితంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
‘‘పెళ్లి చూపులు’ సినిమా విడుదలకు ముందు ఒక సారి విజయ్‌ను కలిసి ‘మళ్లీ రావా’ కథను చెప్పాను. అది ఎందుకో వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ‘కింగ్డమ్’ సినిమాతో కలిసి పనిచేశాం. లొకేషన్స్ ఎప్పుడూ నేచురల్ గా ఉండేలా చూసుకుంటా అది నాకు ఇష్టం. ఎందుకంటే, వీఎఫ్‌ఎక్స్‌తో నేను అనుకున్న విధంగా ఆ సీన్ రాకపోవచ్చు. ఫైట్స్ మాస్టర్స్‌కు కూడా కథ మొత్తం చెప్పి.. మేము తీసే కథకు తగ్గట్టుగా మాత్రమే ఫైట్స్‌ను డిజైన్ చేయించి, అలాగే షూట్ చేశాం. జైలు సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. అందులో 300 మందికి పైగా నటించారు. దాదాపు అందరూ అక్కడివారే. 40 రోజుల షూటింగ్ శ్రీలంకలోనే జరిగింది. ఆ సమయంలో అక్కడి ఆర్మీ మాకు చాలా సహకరించింది. మాకు కావాల్సిన ఆర్మీ ట్యాంకర్లు ఇతర ఆయుధాలు వాళ్లే తీసుకొచ్చి ఇచ్చేవారు. వారి సాయం మర్చిపోలేము’ అంటూ ఈ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పుకొచ్చారు.