KINGDOM Boys: ‘కింగ్డమ్’ బాయ్స్ వచ్చేశారు.. సినిమాపై హైప్ పెంచిన సందీప్ రెడ్డి వంగా
vijay-padcost (image source :X)
ఎంటర్‌టైన్‌మెంట్

KINGDOM Boys: ‘కింగ్డమ్’ బాయ్స్ వచ్చేశారు.. సినిమాపై హైప్ పెంచిన సందీప్ రెడ్డి వంగా

KINGDOM Boys: రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్‌’ జులై 31న (kingdom movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న స్పై యాక్షన్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక (Bhagyashri Borse), సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, గౌతమ్‌ తిన్ననూరి కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read also- Rahul Gandhi: రాజకీయ జీవితంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

ఈ పాడ్‌కాస్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ లు సినిమా షూట్ లో జరిగిన కొన్ని సన్నివేశాలను సందీప్ రెడ్డి వంగాతో పంచుకున్నారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, వాటిని చాలా రియలిస్టిక్‌గా చేయడానికి ప్రయత్నించారన్నారు. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘కింగ్డమ్‌’ సినిమాలో జైల్ ఎపిసోడ్ చూశానని అందులో సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయన్నారు. వాటిని ఎక్కడ తీశారని దర్శకుడిని అడగ్గా.. శ్రీలంకలో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి జైలులో తీసామని సమాధానం ఇచ్చారు. ఇదే విషయంపై విజయ్ మాట్లాడుతూ.. ఆ జైల్ ఎపిసోడ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వర్షం సీన్ కావడంతో జారుతున్న ప్రదేశంలోనే ఫైట్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి మరెన్నో విశేషాలు పాడ్‌కాస్ట్ లో పంచుకున్నారు.

Read also- Home Decor Essentials: మీ ఇంటిని స్వర్గంలా మార్చే 5 బ్యూటిఫుల్ టిప్స్.. ఓసారి ట్రై చేయండి!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇక ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌండ్లో నిర్వహించనున్నాట్లుగా ప్రకటించారు. జులై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ప్రచార చిత్రాలను చూస్తుంటే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ లో చెప్పన భారీ డైలాగులు చూస్తుంటే వజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు చూస్తుంటే చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క