Kingdom: యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక నోట్ విడుదల చేసింది. సింగిల్ స్కీన్‌లకు జీఎస్టీతో సహా 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు 75 రూపాయల వరకూ పెంచుకోంచ్చని, ఈ పెంచిన రేట్లు సినిమా విడుదల తేదీనుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటుందని అందులో పేర్కొంది. దీనిపై విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సంబర పడుతున్నరు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ స్టార్ ఈ సారి హిట్ కొడతాడని అభిమానులు ఆసిస్తున్నారు. టికెట్ రేట్లు కూడా పెరగడంతో ఈ సారి మంచి కలెక్ట్‌న్స్ వస్తాయని చెబుతున్నారు.
Read also- Team India: ఇంగ్లండ్‌తో నాలుగవ టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్‌కు పిలుపు?
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రతిష్టా్త్మకంగా రూపొందించిన ‘కింగ్డమ్’ సినిమా జూలై 31, 2025 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను నిర్మాత మొదలు పెట్టేశారు. అందులో బాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అందులో ఈ సారి విమర్శకులకు దొరక్కుండా ఈ సినిమాని రూపొందించామని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందే టికెట్లు పెంపునకు అనుమతి లభించింది. సాధారణంగా ఏ సినిమాకు అయినా విడుదలకు రెండు మూడు రోజులు ముందు ఈ అనుమతులు ఇస్తారు. అయితే నిర్మాత మాత్రం వారం రోజుల ముందు అనుమతులు తెచ్చుకోవడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. అయితే ఈ సినిమాకు స్పెషల్ షోలు లేనట్టుగానే తెలుస్తోంది. ఇప్పటికీ అధికారికంగా ప్రకటన రావడంతో ఇక ప్రీమియర్ షోలకు అనుమతులు రాదని సినిమా పెద్దలు చెబుతున్నారు.
Read also- Agamagam Edike Bava: మెకానిక్ టు యూట్యూబ్ సెన్సేషన్.. ఎవరీ రవి బాబు?
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇక కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జులై 26న తిరుపతిలో నిర్వహించనున్నారు. జులై 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ప్రచార చిత్రాలను చూస్తుంటే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ లో చెప్పన భారీ డైలాగులు చూస్తుంటే వజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.