Mallareddy Son
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Malla Reddy Son: మల్లారెడ్డి కుమారుడి ఇంటిలో ఐటీ అధికారులు.. నిజమేనా?

Malla Reddy Son: మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రా రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కొంపల్లిలోని ఇంటిలో ఆదాయపు పన్ను(ఐటీ) అధికారులు సోదాలు జరిపారు. సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్నాళ్ల క్రితం అధికారులు వివరాలు తీసుకున్నారు. భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భద్రారెడ్డి ఇంటిలో సోదాలు జరిపినట్టు సమాచారం.

ఇప్పటికే ఈడీ ఫోకస్

మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫోకస్ పెట్టింది. లెక్కల్లో చూపని నగదును గతంలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నది. ఇప్పుడు ఐటీ అధికారులు రంగంలోకి దిగి, ఆర్థిక లావాదేవీలపై కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్టు సమాచారం.

బీజేపీ నేతలతో మల్లారెడ్డి కోడలి భేటీ

ఈ మధ్య బోనాల సందర్భంగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలను కలవడం హాట్ టాపిక్ అయింది. ఆమె బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం కూడా జుగుతున్నది. ఇలాంటి సమయంలో ఐటీ అధికారులు సోదాలకు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

Read Also- Sarcoma Signs: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా? సార్కోమా క్యాన్సర్ కావొచ్చు!

ఐటీ సోదాలపై ప్రీతి రెడ్డి క్లారిటీ

ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి. 2022లో కాళోజీ రావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చారు అని వివరించారు. గురువారం ఉదయం 6 గంటలకు పోలీసులు రావడంతో ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని అన్నారు. తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అన్నీ సక్రమంగా జరిగాయని, ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో అవకతవకలు జరుగకుండా చూడడంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నదని తెలిపారు.

Read Also- Urfi Javed: ట్రోల్స్ చేసినవారికి ధీటుగా రిప్లై ఇచ్చిన ఉర్ఫీ జావెద్.. బొమ్మ అదిరిందిగా

Just In

01

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Warangal District: హన్మకొండలో అతిపెద్ద దుర్గామాత మట్టి విగ్రహం.. ఎత్తు ఎంతో తెలుసా..!

Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!