URFI JAVED ( IMAGE SOURCE :x)
ఎంటర్‌టైన్మెంట్

Urfi Javed: ట్రోల్స్ చేసినవారికి ధీటుగా రిప్లై ఇచ్చిన ఉర్ఫీ జావెద్.. బొమ్మ అదిరిందిగా

Urfi Javed: భారతీయ మోడల్ ఉర్ఫీ జావెద్ గురించి తెలియనివారు ఉండరు. ఉర్ఫీ జావెద్ మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో పేరు పొందిన సోషల్ మీడియా స్టార్, నటి ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె తన చేతికి వచ్చిన వస్తువులతో సృజనాత్మకంగా దుస్తులు రూపొందించి, వాటిని ప్రదర్శించడంలో ప్రత్యేకత సాధించింది. ఇటీవల ఆమె తన లిప్ ఫిల్లర్స్‌ను తొలగించుకుంది. దీని వల్ల ఆమె ముఖంలో వాపు వచ్చింది. ఈ విషయాన్ని దాచకుండా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో వీడియోలు పంచుకుంది. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఎందుకు అలా చేస్తున్నావు అంటూ అభిమానులు కూడా మండి పడ్డారు.

Read also- Aata Sandeep: బిగ్ బాస్ సందీప్ మాస్టర్ తన భార్యను అంతలా టార్చర్ చేశాడా.. వెలుగులోకి నమ్మలేని నిజాలు ?

ఇటీవల, ఉర్ఫీ తన 18 ఏళ్ల వయసు నుండి ఉపయోగిస్తున్న లిప్ ఫిల్లర్స్‌ను తొలగించి వార్తల్లో నిలిచింది. దీని వల్ల ఆమె ముఖంలో వాపు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె హాస్పిటల్ నుండి వీడియోల ద్వారా అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వాపు కారణంగా ఆమెను ట్రోల్ చేసిన వారికి ఆమె ధీటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఇలా ఉన్నానంటూ పొస్ట్ పెట్టింది. దీంతో అప్పుడు ట్రోల్ చేసిన వారందరికీ గట్టిగా ఇచ్చినట్లు అయింది. నీలం, తెలుపు చెకర్డ్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆమె సహజమైన రూపాన్ని పొందాలి నిర్ణయించినట్లు తెలిపింది.

Read also– Pawan Kalyan: హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

ఉర్ఫీ తన అసాధారణ ఫ్యాషన్ ఎంపికలతో ఎల్లప్పుడూ చర్చలో ఉంటుంది. ఆమె చెత్త సంచులు, సాఫ్ట్ టాయ్స్, ఇతర అసామాన్య వస్తువులతో దుస్తులు రూపొందించి, వాటిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంది. ఇదే ఆమెకు భారీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. 2025 నాటికి, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు మరియు X లో 209K కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రాహుల్ మిశ్రా యొక్క పారిస్ ఫ్యాషన్ వీక్ కలెక్షన్‌ను ధరించిన మొదటి భారతీయ స్టార్‌గా గుర్తింపు పొందింది. ఆమె ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కి హాజరు కావాలని ప్లాన్ చేసింది, కానీ వీసా రిజెక్ట్ కావడంతో అది సాధ్యపడలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ