Aata Sandeep: ఆట సందీప్ తన భార్యను అంతలా టార్చర్ చేశాడా
Aata Sandeep ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Aata Sandeep: బిగ్ బాస్ సందీప్ మాస్టర్ తన భార్యను అంతలా టార్చర్ చేశాడా.. వెలుగులోకి నమ్మలేని నిజాలు ?

Aata Sandeep: అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు. ఇటీవలే చాలా మంది సినీ రంగంలో విడాకులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వారికీ సంబంధించిన వార్తలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అయితే, ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండానే సెలబ్రిటీ జంటలు విడిపోడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డాన్స్ మాస్టర్ ఆట సందీప్ భార్య జ్యోతి రాజ్ ఇన్స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసి, విడాకుల గురించి మాట్లాడారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం

అయితే, తాజాగా సందీప్ మాస్టర్ వైఫ్  జ్యోతి రాజ్ భావోద్వేగంతో మాట్లాడుతూ ఓ వీడియోను షేర్ చేసింది.  “మమ్మల్ని చూస్తే అందరూ అద్భుతమైన జంట అని అనుకుంటారు. ఎప్పుడూ కలిసే ఉంటాం, సందీప్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడని చాలామంది చెబుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే, భర్త మంచివాడిగా కనిపించాలంటే, భార్య చాలా విషయాల్లో తగ్గాలి. ఓ మంచి భర్త వెనుక భార్య ఎన్నో త్యాగాలు చేస్తుంది. మన భర్తలు కూడా మన కోసం చాలా విషయాల్లో తగ్గుతారు. అలాగే మనం కూడా వాళ్ల కోసం కొన్ని సార్లు తగ్గితే తప్పేముంది?” అని అన్నారు.

Also Read: Prabhas: బాహుబ‌లి పాత్ర కోసం.. ప్ర‌భాస్ రోజుకి అన్ని గుడ్లు తీసుకున్నాడా.. డైట్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!

ఆమె ఇంకా మాట్లాడుతూ, “పెళ్లికి ముందు ఉన్నట్లు, పెళ్లి తర్వాత ఉండలేము. మన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. భర్త అంటే ఒక్కసారి ‘నో’ అన్నాడంటే, వాళ్ళని ఇంకోసారి అడగకూడదు. అలాగే వాళ్ళకి నచ్చని డ్రెస్ కూడా వేసుకోకూడదు. భర్తలు ఎప్పుడూ నోటితో చెప్పరు చూపుల్లోనే అర్థం చేసుకొని వేరే డ్రెస్ వేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో త్యాగాలు తప్పవు. బయటకు వెళ్లేటప్పుడు కూడా భర్తకు భయపడాలి. అందరూ ఆయన్ని మంచోడు అనుకుంటారు కానీ, దాని వెనుక ఎన్నో అర్థం చేసుకోవడాలు, సర్దుబాట్లు ఉంటాయని మర్చిపోవద్దు” ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

Also Read: Herbal Teas: వర్షాకాలంలో జీర్ణ సమస్యలా? ఈ హెర్బల్ టీలు తాగండి.. రాళ్లు తిన్నా అరిగిపోతాయ్!

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!