Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘కింగ్‌డమ్’. ఈ చిత్రానికి జెర్సీ, మళ్లీ రావా ఫేమ్ సినిమా ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. సత్యదేవ్ కంచరాన, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా జోమన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ వర్క్ చేయగా, ఎడిటింగ్ కి నవీన్ నూలి పని చేస్తున్నారు. స్పై యాక్షన్ డ్రామా, పీరియడ్ థ్రిల్లర్ (రీఇన్కార్నేషన్, యుద్ధం, నాయకత్వం నేపథ్యం) గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా సినిమా రిలీజ్ పోస్ట్ గురించి ట్వీట్ చేశాడు. మరో రెండు రోజుల్లో ట్రైలర్ రానుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా జూలై 31 న రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ గత చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషి ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘కింగ్‌డమ్’తో ఆయన గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగ వంశీ ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది కుటుంబ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని, అన్నదమ్ముల సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు.
గత కొద్దీ రోజుల కిత్రం అతని ఆరోగ్యం గురించి ఆందోళనకర వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా విజయ్‌కు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. విజయ్‌కు డెంగ్యూ జ్వరం సోకినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
In 7 Days – the world of #KINGDOM will be all yours!
In 2 days – #KingdomTrailer 🤗 pic.twitter.com/NUMibY3pnS
— Vijay Deverakonda (@TheDeverakonda) July 24, 2025