Vijay Devarakonda: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌తో ఎందరో జీవితాలు నాశనమయ్యాయి. వారిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడగా, మిగిలినవారు అన్నీ పోగొట్టుకుని రోడ్డునపడ్డారు. ఉన్న ఊరిలో ఉండలేక, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కష్టాలు పడుతున్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు, ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ఇదే క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలకు వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ చేస్తున్నారు. తాజాగా నటుడు విజయ్ దేవరకొండకు ఈడీ నుంచి నోటీసులు అందాయి.
ఆగస్ట్ 11న విచారణ
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఆగస్ట్ 11న హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఆగస్ట్ 6న హాజరు వాలని నోటీసులు ఇవ్వగా, తనకు ఇంకా సమయం కావాలని అడగడంతో అందుకు అంగీకరించిన అధికారులు, తేదీ మార్చి ఆగస్ట్ 11న తప్పకుండా రావాలని ఆదేశించింది.
రానా, విజయ్ దేవరకొండను కలిపి విచారిస్తారా?
ఇదే కేసులో నటుడు దగ్గుబాటి రానాకు కూడా ఈ మధ్య నోటీసులు అందాయి. జూలై 23న విచారణకు రావాలని ఈడీ స్పష్టం చేయగా, అతను టైమ్ కావాలని కోరాడు. షూటింగులు ఉన్నందున రిక్వెస్ట్ చేశాడు. దీంతో అధికారులు ఆగస్ట్ 11న తప్పకుండా రావాలని చెప్పారు. ఇప్పుడు అదే రోజున విజయ్ దేవరకొండను కూడా రమ్మని పిలవడంతో ఇద్దరినీ కలిపి విచారిస్తారా అనే అనుమానం కలుగుతున్నది.
Read Also- Pawan Kalyan: హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
వరుసగా ఈడీ ముందుకు సెలెబ్రిటీలు
జూలై 30న ప్రకాశ్ రాజ్, ఆగస్ట్ 13న మంచు లక్ష్మీని కూడా ఈడీ విచారించనుంది. వీరితోపాటు లిస్టులో ఇంకా చాలామందే ఉన్నారు. నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శ్రీముఖి, వర్షిణ, శోభాశెట్టి, అమృత చౌదరి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, సుప్రీత ఇలా చాలామంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. వీరందిరికీ వరుసగా నోటీసులు పంపి విచారణ జరపనుంది ఈడీ.
ఆసుపత్రి నుంచి విజయ్ దేవరకొండ డిశ్చార్జ్
విజయ్ దేవరకొండ ఈ మధ్య డెంగ్యూ బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చేరి చికత్స తీసుకుంటున్న అతను, గురువారం డశ్చార్జ్ అయినట్టు సమాచారం. మొదట్లో జ్వరంతో ఇబ్బంది పడ్డ విజయ్ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ, ఎంతకీ తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా డెంగ్యూ అని తేలింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తసుకున్నాడు. మూడు రోజల ట్రీట్‌మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. విజయ్ నటించిన కింగ్‌డమ్ మూవీ ఈ నెల 31న విడుదల అవుతున్నది.
Read Also- Rajeev Kanakala: చిక్కుల్లో నటుడు రాజీవ్ కనకాల.. పోలీసుల నోటీసులు.. మ్యాటర్ ఏంటంటే?