Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ” హరి హర వీరమల్లు ” సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఒక రోజు ముందుగానే అంటే జులై 23 సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రస్తుతం, ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. పవన్ అభిమానులు ఈ సినిమా బయటకు రావాలని బలంగా కోరుకున్నారు. వారి కోరిక మేరకు ఈ సినిమా బయటకు వచ్చింది. అయితే, ఈ చిత్రం నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.
దర్శకుడు, సాంకేతిక నిపుణుల మార్పు నుంచి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యేందుకు సినిమా నుంచి విరామం తీసుకోవడం వరకు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించింది. ఈ చిత్ర నిర్మాతలు తన వలన నష్ట పోకూడదని ప్రమోషన్స్ తన భుజాల మీద వేసుకుని చేశాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ గురించి తెలిపాడు.ఈ మూవీ ప్రమోషన్ కోసం జరిగిన ప్రెస్ మీట్‌లో, సాధారణంగా తన సినిమాలను ప్రమోట్ చేయని పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పారు.
Also Read: Herbal Teas: వర్షాకాలంలో జీర్ణ సమస్యలా? ఈ హెర్బల్ టీలు తాగండి.. రాళ్లు తిన్నా అరిగిపోతాయ్!
పవన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
అయితే, పవన్ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ” ఈ సినిమా కోసం నేను ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సినిమా హిట్ అయ్యాక దాని గురించి ఆలోచిస్తా.. అంత వరకు వాటిని పట్టించుకోను. నా ఆలోచన ఏంటంటే, సినిమా ముందు విడుదలై, బాగా ఆడి, నిర్మాతకు లాభం తెప్పించాలి” అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నం పట్ల బాధ్యతతోనే ప్రమోషన్‌లో పాల్గొంటున్నట్లు పవన్ గతంలో కూడా పేర్కొన్నారు. ట్రేడ్ వర్గాల్లో పవన్ ఈ మూవీ కోసం రూ.11-20 కోట్లు తీసుకున్నారని టాక్ నడుస్తుంది. అంతకుముందు ‘బ్రో’ సినిమాకు రూ.50 కోట్లు తీసుకున్నారని అంటున్నారు.
Also Read: Hari Hara Veera Mallu Review: హరిహర వీరమల్లు జెన్యూన్ రివ్యూ