BJP MP Dharmapuri arvind ( IMAGE CREDIT: TWITTER)
Politics

BJP MP Dharmapuri arvind: ఈటల బండి అంశంపై నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి!

BJP MP Dharmapuri arvind: బండి సంజయ్, ఈటల వివాదంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. పార్టీ అన్నాక గొడవలు కామన్ అని వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈటల, బండి వివాదంపై బీజేపీ పాత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,(Kishan Reddy)  నూతన అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao)కలిసి మాట్లాడాలన్నారు. అవసరమైతే అధిష్టానం పెద్దలు మాట్లాడాలన్నారు. ఈ అంశంపై సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని కోరారు. ఇకపోతే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఎలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

 Also Read: Ramchander Rao: మళ్లీ హస్తినకు బీజేపీ స్టేట్ చీఫ్.. అమిత్ షాతో భేటీ

కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారో కూడా కాంగ్రెస్(Congress) నేతలు చూసుకోవాలని చురకలంటించారు. ఇక కవిత, కేటీఆర్(KTR) ఏం చేస్తున్నారో కూడా వారు చూసుకోవాలన్నారు. ఇకపోతే రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని అర్వింద్ స్పష్టంచేశారు. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అంటూ కొనియాడారు. రాజా భాయ్ సస్పెండ్ అవ్వలేదని, రిజైన్ చేశాడని తెలిపారు. రాజాసింగ్(Raja Singh) పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి మెంబర్ షిప్ తీసుకోవచ్చన్నారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్(Raja Singh) రిజైన్ చేశాడని అర్వింద్ వెల్లడించారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

తెలంగాణ బీజేపీ,(Telangana BJP) ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరారు. పనిచేసేందుకు అవకాశం కల్పంచాలన్నారు. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని వ్యాఖ్యానించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలు, నాయకులయ్యే సమయం ఇదని ఆయన వెల్లడించారు. ఇందూర్ జిల్లాలో(Indore District)జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తామే గెలుస్తున్నామని అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని ఆయన తెలిపారు. నాయకులంతా ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని అర్వింద్ పిలుపునిచ్చారు.

Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది