Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు మళ్లీ హస్తిన నుంచి పిలుపొచ్చింది. ఇటీవలే రెండ్రోజుల పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన మరుసటి రోజే ఆయనకు మళ్లీ ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో కాషాయ దళపతి తిరిగి దేశ రాజధానికి వెళ్తున్నారు. గురువారం కేంద్ర మంత్రి అమిత్(Amit Shah ) షాతో భేటీ అవ్వనున్నారు. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) మధ్య ఇష్యూపై ఏమైనా చర్చలోకి వచ్చే అవకాశముందా? అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఇష్యూ కారణంగా పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం ఈ అంశంపై స్పందించారు. పార్టీ కలగజేసుకోవాలని కోరారు. ఈటల, బండి సంజయ్(Bandi Sanjay) ఇష్యూపై సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేయాలని కోరడంతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ అంశం సైతం కొత్త చర్చ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఈటల, బండి ఇష్యూపై పాత టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. అవసరమైతే అధిష్టానం పెద్దలు స్పందించాలని, సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అయ్యారు. అర్వింద్ అమిత్ షాతో భేటీ పూర్తయిన కాసేపటికే తెలంగాణ కాషాయ దళపతి రాంచందర్ రావుకు అమిత్ షా కార్యాలయం నుంచి ఢిల్లీకి రావాలని ఫోన్ రావడంపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లారు. కాగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయించి ఎంపీలంతా మంగళవారం విందుకు ఒకచోట కలిశారు. అయితే ఈ అంశం సైతం కొత్త చర్చకు దారితీసింది. దీనిపై ఎంపీలు క్లారిటీ ఇచ్చినా ప్రచారం కొనసాగుతూనే ఉంది.
Also Read: Gurukul kitchens: పుడ్ పాయిజన్లపై సర్కార్ సీరియస్.. త్వరలో మార్గదర్శకాలు
ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో
తెలంగాణ కాషాయ దళపతి రాంచందర్ రావు(Ramchander Rao) వాస్తవానికి గురువారం మహబూబ్ నగర్ లో పర్యటించాల్సి ఉంది. కాగా ఆయనకు ఢిల్లీ(Delhi) నుంచి పిలుపు రావడంతో ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఈనెల 26న మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో, 27న గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొనసాగనుంది. గతంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాల ఎమ్మెల్సీగా ఆయన సేవలందించారు. ఆ పర్యటనను కూడా రద్దుచేసుకుని ఢిల్లీకి వెళ్తుండటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో బండి-ఈటల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
ఈ ఇష్యూపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరొందిన రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపిన హైకమాండ్.. పార్టీ లైన్ దాటితే ఎలాంటి పర్యవసనాలు ఎదర్కొంటారనేది చెప్పకనే చెప్పింది. దీంతో బండి-ఈటల(Etela Rajender) వ్యవహారంపై హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ సరికొత్త ప్రయోగం.. విదేశీ తరహాలో ప్లాన్!