Nithya Menen: ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఆరంగేట్రం చేసిన నిత్యామేనన్ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశం కలిగింది. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేశారు. దాదాపు పదిహేను సంవత్సరాలు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సార్ మేడమ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిత్యామేనన్ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటలను పంచుకుంది. ప్రేమపై తనకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రపంచంలో అందరికీ ప్రేమ వివాహం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రేమ వివాహమే చేసుకోవాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటూ తన మనసులో భావాలను చెప్పుకొచ్చారు.
‘ప్రేమ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం అలాంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు, సమాజం, కుటుంబం కారణంగా ఎందుకో సోల్ మేట్ ఉంటే బాగుంటుందని అనిపించేది. ఇప్పడు అవసరం లేదనిపిస్తుంది. ఒకా నోక సమయంలో సోల్ మేట్ ను వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వేరే రకంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చని అర్థం చేసుకున్నాను. అందరికీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదుకదా! ది గ్రేట్ పర్సన్ అయిన రతన టాటా కూడా వివాహం చేసుకోలేదు కదా. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అదే జీవితం కాదు. అది లేకపోతే బతకగలము. తోడు లేనప్పటికీ ఒక్కో సారి బాధగా ఉన్నా.. స్వేచ్ఛగా, ఆనందంగా జీవించవచ్చు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి కొన్ని అనుభవాలు నేర్చుకున్నా.. ఈ స్థితిలో ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
Read also- Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
తాజాగా నిత్యా మేనన్ ‘సార్ మేడమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ఏ స్థాయిలో ఉంటాయో. ఆ తర్వాత వారు ఎలా మరలా కలుసుకుంటారో అన్న కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. విజయ్ సేతుపతి ఉండటంతోనే ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యామేనన్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఎంతో సహజంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సహజత్వానికి ఎక్కడా తీసి పోకుండా ఉండేలా ఉందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.