Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే, ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని అడ్డంకులే. సినిమా టీజర్ నుంచి రిలీజ్ వరకు ఎన్నో గండాలు. వాటన్నింటిని ఎదురుర్కొంటూ ముందుకు సాగారు. పైగా సినిమా మొదలు పెట్టినప్పుడు కరోనా వచ్చింది. ఆ సమయంలో కూడా అందరూ రెండేళ్ళు ఇంటికే పరిమితమవ్వాల్సింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘హరి హర వీరమల్లు’ నే.
Also Read: New NCERT book: విద్యార్థుల పాఠ్యపుస్తకంలో శుభాంశు శుక్లా సందేశం.. ఇంతకీ ఏం చెప్పారంటే?
ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా నిధి అగర్వాల్ (పంచమి అనే శక్తివంతమైన పాత్రలో) నటిస్తుంది. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా జ్ఞానశేఖర్ పని చేయగా, స్క్రిప్ట్ & డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందించారు.
Also Read: Shilpa Shirodkar: తను టెన్త్ ఫెయిల్.. భర్త డబుల్ ఎంబీఏ.. నమ్రత చెల్లి గురించి ఈ విషయాలు తెలుసా?
ఆ సినిమా చేయాలంటే దేవుడి దయ ఉండాలి
అయితే, ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పార్ట్ 2 పూర్తి చేయాలంటే పెద్ద సాహసమే చేయాలి. దానికి సరైన సమయం, బడ్జెట్, దేవుడి దయ కూడా అవసరం” అని తన మాటల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా మొదలు పెట్టారని.. 20 నుంచి 30 శాతం పూర్తయ్యిందని తెలిపారు. దీంతో ఇప్పుడు ” హరి హర వీరమల్లు 2″ పై మరింత ఆసక్తి పెరిగింది.
Also Read: Doctors Prescription: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఎందుకు అర్థం కాదు? దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!
పవన్ కథ చెప్పిన ప్రకారం, ఈ చిత్రం కోహినూర్ వజ్రం (Kohinoor Diamond)ను తిరిగి స్వదేశానికి తీసుకురావాలనే యోధుని కథ ఆధారంగా తెరకెక్కిందని చెప్పారు. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని స్పష్టం చేశారు. అంతక ముందు వరకు ఇది సర్వాయి పాపన్న (Sarvai Papanna) బయోపిక్ అని అన్నారు కానీ, పవన్ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.