Bhatti Vikramarka: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు దళితులు, బీసీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు ఉన్నదని, ఈ దేశంలో ఈ వర్గాలకు మేలు జరుగుతుంటే ఆయనే పదే పదే అడ్డుపడుతున్నారంటూ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, వ్యక్తిగా, పార్టీగా ఏం చేయాలో తనకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. (Hyderabad Central University) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాంచందర్ రావు (Ramchandra Rao) పాత్ర ఏమిటో అందరికీ తెలుసునని వివరించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది తామేనని, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) ఎలా ప్రకటిస్తారని నిలదీశారు.
Also Read: Telangana BJP: బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలి భేటీ.. కమలనాథుల తలో దారి ఒకరిపై ఒకరు పోటీ
పార్లమెంట్‌లో కూడా సపోర్టు
ఆయన సెక్రటేరియట్‌లో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంశమని, రాజకీయ పార్టీలకు సంబంధం లేనిదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఈ పద్ధతిలో కుల గణన జరగలేదని, తెలంగాణ చేపట్టిన కుల గణన దేశానికి దిశా నిర్దేశం చేసిందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్ధతు ఇచ్చాయని, పార్లమెంట్‌లో కూడా సపోర్టు చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. అక్కడ భిన్న తీరుగా వ్యవహరిస్తాయనే అనుమానం తమలో లేదన్నారు. ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కుల గణనపై ఎంపీలకు వివరించి, పార్లమెంట్‌లోనూ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..