Telangana BJP ( image CREDIT: TWITTEER)
Politics, లేటెస్ట్ న్యూస్

Telangana BJP: బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలి భేటీ.. కమలనాథుల తలో దారి ఒకరిపై ఒకరు పోటీ

Telangana BJP: బీజేపీ నేతలు మైండ్ గేమ్ షురూ చేశారా, సొంత పార్టీలో పోటీగా వచ్చేవారికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారా, అంటే అవుననే సమాధానమే వినిస్తున్నది. అందుకే తమకు కాంపిటేషన్‌గా ఫీలైన వారి జిల్లాల్లో తమ సొంత టీమ్‌లను ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు మండలాలు, జిల్లాల్లో తమ వర్గీయులను రంగంలోకి దింపినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన వారితో సైతం సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా బీఆర్ఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, (Prithi Reddy) కేంద్రమంత్రి (Bandi Sanjay) బండి సంజయ్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ (Hyderabad) బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ మీటింగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో కీలకంగా మారింది. ఈ భేటీ కారణంగా మల్లారెడ్డి (Malla Reddy) బీజేపీలో చేరుతున్నారా అనే చర్చ మొదలైనా, అనేక అనుమానాలున్నాయి.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

బీజేపీలో చేరతారా?

తెలంగాణ కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాంచందర్ రావు (Ramchandra Rao) ఆపరేషన్ ఆకర్స్‌కు తెరలేపారు. పార్టీలో జాయినింగ్స్‌పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో (Bandi Sanjay బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి , (Prithi Reddy) భేటీ అవ్వడం వెనుక మతలబేంటని చర్చించుకుంటున్నారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంటిలో విందుకు బండి సంజయ్ వెళ్లగా, అక్కడ ఆమె సైతం ప్రత్యక్షమైంది. బండితో కలిసి భోజనం చేసినట్లు తెలిసింది. అయితే, బీఆర్ఎస్  (BRS) అధికారం పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

సీన్ కట్ చేస్తే, తాజాగా బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ అవ్వడం వెనుక మతలబేంటని చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా బండి సంజయ్, ప్రీతి రెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు. అయినా ఈ ప్రచారానికి బ్రేక్ పడడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా నేతల ఫ్లెక్సీలో ఆమె బోనం ఎత్తుకున్న ఫొటో ఉండడంతో త్వరలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్నది.

బండి గేమ్ స్టార్ట్ చేశారా?

కేంద్ర మంత్రి బండి సంజయ్, (Bandi Sanjay)ప్రీతి రెడ్డి భేటీ వెనుక మైండ్ గేమ్ ఉందన్నవారూ లేకపోలేదు. ఎందుకంటే పార్టీలో బండికి, కొందరు నేతలకు ఏమాత్రం గిట్టదనే ప్రచారంలో ఉన్నది. అందులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ప్రధానంగా ఉన్నట్లుగా చెబుతుంటారు. అయితే, ఇన్నిరోజులు ఈటల, బండి మధ్య కొనసాగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో బండి మైండ్ గేమ్‌కు తెర తీశారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు.

అదే నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈటలకు బండికి మధ్య ఉప్పు నిప్పులా వైరం కొనసాగుతుండడంతో దాన్ని అడ్వాంటేజీగా బండి మార్చుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఈటలకు చెక్ పెట్టడంలో భాగంగానే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర నేతలదీ అదే దారి

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించాక ఆయన సైలెంట్ అయ్యారు. తన పదవి పోవడంలో ఈటల కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అందుకే ఆయనను టార్గెట్‌ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, ఎంపీగా గెలిచాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించినా కరీంనగర్ టు ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ, కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం తర్వాత సంజయ్ (Bandi Sanjay) కాస్త దూకుడు పెంచారు. క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తనకు పోటీగా ఉన్న అందరికీ చెక్ పెట్టాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

ఇటీవల హుజూరాబాద్‌లో ఈటలకు వ్యతిరేకంగా ఉన్నవారికి పదవులు దక్కడంలో సైతం బండి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం ఉన్నది. అయితే, ఈటల కూడా ఏం తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య తన అనుచరులతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాస్త అసహనం ఉన్నా, పార్టీలో క్రమంగా బలపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు, రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి ఆశించారు. మాటకారి కావడంతో పార్టీలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది రుచించని ఇతర నేతలు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రఘునందన్ లాబీయింగ్ పై బండి పెదవి విరిచినట్లుగా ప్రచారం ఉన్నది.

అలాగే, ఒకే సామాజికవర్గమైన అరవింద్‌ను సైతం పక్కలో బళ్లెంలా బండి ఫీలవుతున్నారని అనుకుంటున్నారు. ఇంకోవైపు అరవింద్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సొంత టీమ్‌తో ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే అరవింద్‌కు బండికి గ్యాప్ వచ్చిందని టాక్ ఉన్నది. ఇలా తమకు పోటీ అనుకున్న వారందరినీ ఎదగనివ్వకుండా చెక్ పెట్టాలనే యోచనలో నేతలు ఉన్నారని తెగ చర్చించకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇతర పదవుల్లో అనుచరులు, వర్గీయులనే నియమించుకుని ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.

Also Read: Jurala Accident: జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..