Yogi Babu: ‘మత్తు వదలరా’ సినిమాతో ఆరంగేట్రం చేసిన నరేష్ అగస్త్య ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాతో నవ్వించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. యేగిబాబు ఈ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం పోస్టర్ ను విడుదల చేసింది. అందులో యోగిబాబు కారులో నుంచి దిగుతూ డోర్ మీద చేతులు పెట్టుకుని కనిపిస్తారు. ఈ చిత్రంలో యోగిబాబు ఉడ్రాజు అనే పాత్రలో అందరినీ నవ్వించబోతున్నారని మూవీ టీం తెలిపింది. ఆయన పాత్ర ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పర్పెక్ట్ డార్క్ కామెడీ జోనర్‌లో ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా రూపొందుతోంది. దర్శకుడు మురళీ మనోహర్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నారని నిర్మాతలు తెలిపారు.
Read also- Marriage: పెళ్లి కాని ప్రసాద్‌లకు దడ పుట్టించే వార్త.. వెంటనే చెక్ చేస్కోండి!
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమా కామెడీ జోనర్ లో ఉండబోతుందని తెలిపేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా ప్రేక్షకులు. ఎప్పుడూ చూడని డార్క్ కామెడీ కథ ఈ సినిమాలో ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read also- Doctors Prescription: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఎందుకు అర్థం కాదు? దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!
కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యోగి బాబు. 2009లో విడుదలైన ‘యోగి’ అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా టాలీవుడ్ లో కూడా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వబోతున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ బడా సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. మారుతీ, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. హారర్, కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.