Ram Charan Peddi
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan Peddi: అన్ బిలీవబుల్ బీస్ట్ మోడ్‌లోకి రామ్ చరణ్.. పిక్ వైరల్!

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). ‘గేమ్ చేంజర్’ (Game Changer) తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారనే విషయం తెలియంది కాదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా బజ్‌ని క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన, లెన్తీ షెడ్యూల్ జూలై 22, మంగళవారం నుంచి ప్రారంభం కాబోతుందని తెలుపుతూ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. ఈ సినిమా గురించి, రామ్ చరణ్ గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.

Also Read- PSPK: సినిమాలు చేసుకుంటున్నాడని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. నేను నిలబడ్డాను! ఎందుకంటే?

ఈ కీలకమైన షెడ్యూల్‌కు ముందు రామ్ చరణ్ ఈ పాత్ర కోసం నెవర్ బిఫోర్ అవతార్‌లోకి మారినట్లుగా ఈ లుక్ తెలియజేస్తోంది. పవర్‌ఫుల్ లుక్‌కి ఫిట్ అవడానికి ఆయన ఎంతగా ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారనే దానికి ఇది ఉదాహరణగా మారుతోంది. ఈ సినిమా కోసం కంటిన్యూగా కసరత్తులు చేస్తూ, ఎంతో డెడికేషన్‌తో ఫిజిక్‌ను సాలిడ్‌గా తీర్చిదిద్దుకుంటున్నారు. జిమ్‌లో తీసిన ఈ ఫోటో చూస్తే… రగ్గడ్ బీర్డ్, ముడి వేసిన జుట్టు, స్ట్రాంగ్ బాడీతో చూడగానే హాలీవుడ్ హీరో రేంజ్ ఇంపాక్ట్‌ని ఈ లుక్ కలగజేస్తోంది. ఈ మార్పు కేవలం లుక్ కోసమే కాదు, పాత్రపై అతని అంకితభావానికి నిదర్శనం అనేలా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. గ్రీక్ గాడ్‌లా కనిపిస్తున్న చరణ్ రెగ్యులర్ మోడ్ వదిలేసి.. అన్ బిలీవబుల్ బీస్ట్ మోడ్‌లోకి ఫుల్‌గా మారిపోయారు. ఈ లుక్ తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోతుంది.

Also Read- Pawan Kalyan: అందుకు నాకు పొగరో, అహంకారమో కారణం కాదు.. ఏంటంటే?

మొదటి నుంచి, అంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ భారీ అంచనాలను మరింతగా పెంచేస్తుంది ఈ లుక్. రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న విడుదల కానున్న ఈ ‘పెద్ది’ చిత్రం, అతని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చరణ్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూడటంతో ఫ్యాన్స్‌లో క్యురియాసిటీ మరింతగా పెరుగుతోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అలాగే రామ్ చరణ్‌కు కూడా ఈ సినిమా ఎంతో కీలకమైనదనే విషయం తెలియంది కాదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?