CM Revanth Reddy (image credit: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: ఘనంగా బోనాల ఉత్సవాలు.. అధికారులపై సీఎం ప్రశంసలు

CM Revanth Reddy: చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు విజయవంతంగా జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని అన్నారు.

 Also Read: Alampur Highway: నేషనల్ హైవే రోడ్డు పక్కనే తాగుతున్న పట్టించుకునే నాథుడే కరువు

ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ (Telangana) గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana) సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందన్నారు. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో ఘటం ముగుస్తుందన్నారు. బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

 Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!