Pawan Kalyan and AM Rathnam
ఎంటర్‌టైన్మెంట్

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ఎలా ఉంటుందంటే..

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడే చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. జూలై 24న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే విషయం తెలియంది కాదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నిర్మాత ఎఎం రత్నం మీడియాకు తెలియజేశారు.

Also Read- Rahul Sipligunj: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా

‘‘ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య దాదాపు 25 సంవత్సరాల అనుబంధం ఉంది. పవర్ స్టార్‌ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయనంటే నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ‘ఖుషి’ సినిమా సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు నేను చాలా పెద్ద సినిమాలు చేశాను. ‘ఖుషి’ ఒక ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఒక సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చొప్పించారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తాయి. ‘హరి హర వీరమల్లు’ కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా.. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక మెసేజ్‌ని ఇస్తుంది.

పవర్ స్టార్ ఇప్పుడు జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి మాపై చాలా ఉంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించాము. అందుకే మరింత శ్రద్ధగా ఈ సినిమాని రూపొందించాము. పవర్ స్టార్ గౌరవానికి తగ్గట్టుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా ఉంటుంది. అలాగే ఆయన అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. పవర్ స్టార్ సహకారం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ఆయన సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం అంత సాధ్యం కాదు. ఆయనంటే నాకు ఎంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి అంతే ఇష్టం. మేకర్‌గా నన్ను ఆయన ఎంతగానో గౌరవిస్తారు. ఈ సినిమాకు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీమ్ అంతా ఎంతో సహకరించారు. అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.

Also Read- Namrata Shirodkar: ‘నీవు నా ప్రపంచాన్ని మార్చావు’ అంటూ నమ్రత స్పెషల్ పోస్ట్

మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, ఈ సినిమా విషయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో జ్యోతి ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా, ఇండియనా జోన్స్ తరహాలో హరి హర వీరమల్లుని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఈ సినిమాను రెడీ చేశాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవర్ స్టార్ కూడా ఎంతగానో ప్రశంసించారు..’’ అని నిర్మాత రత్నం చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!