Harish Rao
తెలంగాణ

Harish Rao: విద్యార్థి, యువకులతో హరీశ్ రావు స్ట్రాటజీ!

Harish Rao: విద్యార్థి, యువతలో తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన పోరాట స్ఫూర్తిని రగిల్చేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణపై ఏపీ అనుసరిస్తున్న విధానం, బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలను వివరించేందుకు సిద్ధమైంది. కరపత్రాలతో యువతను చైతన్యం చేసే ప్లాన్ చేస్తున్నది. అందుకు యూనివర్సిటీలు, విద్యా సంస్థలను వేదికగా చేసుకొని ముందుకు సాగేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగానికి 5 రోజులు షెడ్యూల్‌ను అధిష్టానం ఇచ్చినట్లు సమాచారం. ఆ ప్రణాళికలతోనే విద్యార్థి నాయకులు ముందుకు సాగుతున్నారని, బనకచర్లతో తెలంగాణను జరుగుతున్న నష్టంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Read Also- Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి

రంగంలోకి హరీశ్ రావు
గులాబీ పార్టీని పటిష్టం చేయాలంటే తొలుత అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని యాక్టీవ్ చేసేందుకు ప్లాన్ చేశారు. బనకచర్లపై అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని భావించిన పార్టీ, యూనివర్సిటీ, కళాశాలలు, పాఠశాల దగ్గర ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టుపై విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘‘తెలంగాణ నీటి హక్కుల కోసం జంగ్ సైరన్ మోగిద్దాం – బనకచర్ల ద్రోహాన్ని బద్దలు కొడదాం -ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకుందాం – గోదావరిలో తెలంగాణ వాటాను కాపాడుకుందాం’’ అనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కరపత్రాలను ముద్రించారు. వాటిని పంపిణీ చేయాలని అధిష్టానం 5 రోజుల షెడ్యూల్‌ను విద్యార్థి నాయకులకు ఇచ్చింది. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలు అయినప్పటికీ పూర్తి వాటా వినియోగించుకోలేకపోతున్నామని, దానికి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో తగినన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరుగలేదనే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని వివరిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఏపీ అదనంగా 200 టీఎంసీల నీటిని తరలించుకుపోతే తెలంగాణకు నీటి కోరత ఏర్పడుతుందని, గోదావరి జలాల్లో తీరని నష్టం జరుగుతుందని, భూములన్నీ బీడుగా మారుతాయనేది విస్తృత ప్రచారం చేస్తున్నది. అంతేకాకుండా బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని సైతం ఎండగడదామని, ఏపీ జల దోపిడీపై నోరుమెదపని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నిలదీద్దామని, కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి సన్నద్ధమవుదామని పేర్కొంటూ రాష్ట్ర సాధనకు ఏ విధంగానైతే ఉద్యమం చేశారో అదే ఉద్యమ స్పిరిట్ రగలిచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.

Read Also- Vizag Scam: వైజాగ్‌లో అంబేద్కర్ పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన మ్యాక్స్‌!

26న కేసీఆర్ అధ్యక్షతన సమావేశం?
విద్యార్థి సంఘ నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసి విద్యార్థి నేతలకు ప్రణాళిక ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అయితే, ఈ భేటీ నందినగర్ లో ఉంటుందా, తెలంగాణ భవన్‌లో జరుగుతుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. లేకుంటే హరీశ్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. కానీ సమావేశం మాత్రం ఉంటుందని విద్యార్థి విభాగం నేతలు తెలిపారు.

విద్యార్థుల సమస్యలు, గురుకులాల వసతులపై..
త్వరలోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా బీఆర్ఎస్వీ పోరాట బాట పట్టనున్నట్లు సమాచారం. ఉపకార వేతన బకాయిలు, గురుకులాల్లో వసతులపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. ఇప్పటికే గురుకులాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యా సంస్థల ముందు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యలపై త్వరలోనే కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం. అదే విధంగా విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కంప్లీట్ కాగానే పాఠశాల స్థాయి నుంచి కళాశాల, యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కమిటీలు వేయాలని భావిస్తున్నది. అందుకు సైతం షెడ్యూల్‌ను విడుదల చేస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. ఏది ఏమైనా హరీశ్ రావు స్ట్రాటజీని పార్టీ అమలు చేస్తూ విద్యార్థి విభాగం నాయకులకు కార్యాచరణ ఇస్తున్నది.

Read Also- ORR: ఔటర్.. టెర్రర్.. అసలు నిజాలు ఇవిగో!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు