Midhun Reddy Arrest
ఆంధ్రప్రదేశ్

Midhun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్.. తర్వాత జాబితాలో ఉన్నది వీళ్లే!

Midhun Reddy: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు సిట్ అధికారులు.. మిథున్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే మిథున్ రెడ్డి బాబాయ్ పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఇవాళ రాత్రికి సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉండనున్నారు. ఆదివారం ఉదయం లేదా సోమవారం నాడు కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం కుంభకోణంలో ఏ4 గా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం సుదీర్ఘంగా విచారించి.. ఆఖరికి అరెస్ట్ చేశారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ‘స్వేచ్ఛ’ ముందే చెప్పింది. చెప్పినట్టుగానే శనివారం రాత్రి వైసీపీ ఎంపీని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టుతో 12కు అరెస్టుల సంఖ్య చేరినది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కావడంతో ఫ్యాన్ పార్టీలో అలజడి మొదలైంది. నెక్స్ట్ ఇక జగన్ రెడ్డే అరెస్ట్ కాబోతున్నారని అటు టీడీపీ.. ఇటు వైసీపీ పార్టీలో పెద్ద ఎత్తునే చర్చ మొదలైంది. ఇవన్నీ ఒకెత్తయితే రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్ జరగొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పలువురు మాజీ మంత్రుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Read Also- Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

మాజీల సంగతి ఇదీ..
త్వరలో అరెస్ట్ అయ్యే వైసీపీ మాజీ మంత్రులు వీరే అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే హడావుడి చేస్తున్నారు. ఇదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాకే అని చెప్పుకోవచ్చు. అరెస్ట్ లిస్టులో వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు టీడీపీ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ రావడంతో వల్లభనేని వంశీ రిలీజ్ అయ్యారు. కాకాణి, చెవిరెడ్డిలు పలు కీలక కేసుల్లో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం నాడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అయితే ఇళ్ల పట్టాల కేసులో పేర్ని నానికి కోర్టులో ఊరట లభించకపోవడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులకు మార్గం సుగుమమైంది. కాగా, అటు అరెస్టులు.. ఇటు అరెస్ట్ కాబోయే జాబితా రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

Read Also- Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ

ఎందుకీ కక్ష సాధింపు?
వైసీపీ నాయకులు ఈ అరెస్టులు, కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కేసులు పెడుతోందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మొత్తమ్మీద.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై పలు కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీస్తోంది. విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి.. కూటమి ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయని మండిపడ్డారు. వ్యక్తులను ముందుగానే టార్గెట్ చేసుకుని లేనిపోని ఆరోపణలతో పచ్చ మీడియాలో రాయిస్తారని.. ఆ తర్వాత అతనే మాస్టర్ మైండ్ అంటూ చుట్టూ కథ అల్లుతారని ఆరోపించారు. దానికి అనుగుణంగా కొంతమంది వద్ద భయపెట్టి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారన్నారు. అలా ఇరికించి జైళ్లో వేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. దానిలో భాగంగానే తనపై కేసు నమోదు చేసినట్లుగా ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మద్యం కేసు అనేదే ఒక మిథ్య అని అవినీతి జరిగిందా? లేదా? అనేది ప్రజలకు తెలుసని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా.. ఇక టికెట్స్ తెగడమే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ