Fish Venkat
ఎంటర్‌టైన్మెంట్

Fish Venkat: ముంగిలంపల్లి వెంకట్ నుంచి ‘ఫిష్’ వెంకట్‌‌గా ఎలా మారాడు?

Fish Venkat: తెలుగు సినీ పరిశ్రమలో సుపరిచితమైన హాస్య నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. కొన్నిరోజులుగా కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి ఉదయం మరణించాడు. అతని బ్లడ్ గ్రూపునకు సరిపోయే కిడ్నీ ఇచ్చే డోనర్ దొరక్కపోవడం, మరోవైపు రూ.50 లక్షలు ఆపరేషన్‌కు కావాల్సి ఉన్నా అందులో కొంత మొత్తమే డొనేషన్స్ రూపంలో అందినట్టుగా తెలుస్తున్నది. అయితే వెంకట్ శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచాడు. రెండు కిడ్నీలు పాడవ్వడం సరైన సమయంలో ఆపరేషన్ చేయించుకోకపోవడం వల్ల ఆ ఇన్‌ఫెక్షన్ లివర్‌కు పాకిందని ఆయన కుమార్తె చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. సరైన దాత లభించకపోవడం, అలాగే చికిత్సకు అయ్యే భారీ ఖర్చు కూడా ఒక సవాలుగా మారింది. అలా ఆరోగ్యం క్షీణించి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఇవన్నీ కాసేపు అటుంచితే.. అసలు ఎవరీ ఫిష్ వెంకట్.. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు పేరు ముంగిలంపల్లి అయితే ఫిష్ అని ఎందుకొచ్చింది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..

Read Also- HHVM: ‘హరి హర వీరమల్లు’ మూవీకి భారీగా టికెట్ రేట్లు పెంపు

Venkat Fish

ఎవరీ వెంకట్?
1971 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించాడు. అయితే చిన్నతనంలోనే హైదరాబాద్‌కు వలస వచ్చాడు. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తన ఫ్రెండ్, దివంగత నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. దర్శకుడు వివి వినాయక్ 2002లో వచ్చిన ‘ఆది’ సినిమా ద్వారా ఆయన్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. ‘ఖుషి’ సినిమాలో గుడుంబా సత్తి గ్యాంగ్‌లో చేసిన పాత్ర కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో 90 నుంచి 100 సినిమాల్లో నటించారు. ‘ఆది’, ‘దిల్’, ‘బన్ని’, ‘కింగ్’..‘అత్తారింటికి దారేది’, ‘మిరపకాయ్’.. ‘ గబ్బర్‌సింగ్’, ‘డీజే టిల్లు’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘పలాస 1978’ వంటి అనేక హిట్ చిత్రాల్లో ఆయన నటించి మంచి గుర్తింపు పొందారు. పక్కా తెలంగాణ యాసలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా పోషించాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రలకు, తనదైన బాడీ లాంగ్వేజ్‌కి ప్రసిద్ధి.

Read Also- Nara Lokesh: పెట్టుబడుల కోసం పోటీ.. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్!

Mungilampalli Venkatesh

ఆ పేరు ఎలా వచ్చింది?
ఫిష్ వెంకట్ అసలు పేరు.. మంగళంపల్లి (ముంగిలంపల్లి) వెంకటేశ్ (Mungilampalli Venkatesh). ఆయన సినీ పరిశ్రమలోకి రాకముందు ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపల (Fish) వ్యాపారం చేసేవాడు. ఆ కారణంగానే అందరూ ఆయన్ను ‘ఫిష్ వెంకట్’ అని పిలవడం మొదలుపెట్టారు.. అదే పేరు ఆయనకు సినీ రంగంలో కూడా స్థిరపడింది. వాస్తవానికి సినిమాల్లో చాలా మందికి తొలిపాత్ర లేదా తొలి సినిమా ఇంటి పేరుగా మారుతూ ఉంటుంది. కానీ ఫిష్ వెంకట్‌కు మాత్రం ఆయన వృత్తే ఇంటి పేరుగా మారింది. ఆయన పుట్టింది మచిలీపట్నంలోనే అయినా పెరిగిందంతా తెలంగాణలో కావడంతో ఈ యాస వచ్చేసింది. అలా ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడే తనదైన శైలితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చారు. తన నటనతో తెలుగు సినిమాకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొంతకాలంగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు, కానీ సరైన దాతలు దొరకలేదు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దురదృష్టవశాత్తు శుక్రవారం కన్నుమూశాడు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఫిష్ వెంకట్ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, నటులు, దర్శకులు, నిర్మాతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read Also- Jasprit Bumrah: బుమ్రా స్థానంలో ఎవరు?.. తెరపైకి డెబ్యూట్ ప్లేయర్!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?