Thummala on KTR: కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు మాట్లాడేముందు మీ నాన్న నీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలి. ప్రజలు పీకేసినోళ్లు మల్లీ పీకుతామంటే అపహాస్యంగా ఉందని మంత్రి తమ్మల అన్నారు. మీ అహంకారం వల్లే ప్రజలు మీకు టగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడులో కేసీఆర్(KCR) శంకుస్థాపన చేస్తే ఎందుకు రీ డిజైన్‌లో మార్చారు. ఇంట్లో సరిచేసుకోలేని సన్నాసులు దేశ రాజకీయాలు చేస్తారట అంటూ ఎద్దేవ వేశారు. అసెంబ్లీలో బుద్ధి చెప్పినా పార్లమెంట్‌లో బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని అన్నారు.
కేసీఆర్‌ని ఇబ్బంది పెట్టేలా రాజకీయం
బనకచర్ల మీద కాళేశ్వరం(Kaleshwaram) పైన బొక్కినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పెద్దాయనను ఇబ్బంది పెట్టేలా కేటీఆర్(KTR) రాజకీయం చేస్లున్నారని మత్రి తుమ్మల(MIN Thummala) పేర్కోన్నారు. పిచ్చి మాటలు రోత మాటలు మాట్లాడి రాజకీయాలు దిగ జార్చోద్దు, విందుల్లో విలాసాల్లో మునిగి గోదావరి కృష్ణా నదుల వాటాలు దారాదత్తం చేసారని అన్నారు. ఏ మొహం పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మీ పాలనలో జరిగిన విధ్వంసం సరి చేసేందుకు ఇంత కాలం పట్టిందని అన్నారు.
Also Read: Hyderabad Heavy Rains: నగరంలో భారీ వర్షం .. ట్రాఫిక్‌తో వాహనదారుల ఇక్కట్లు
రైతు శవాల పై పేలాలు ఏరుకుని అధికారం లోకి రావాలని మీ కలలు కలగానే మిగులుతాయి. ముఖ్యమంత్రి(CM) పై మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలని ఫైర్ అయ్యారు. మీ పాలనలో పడావు పడ్డ సీతారామ ప్రాజెక్ట్(Sitarama Project)ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని అన్నారు. రాజీవ్ లింక్ కెనాల్‌తో సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్ళు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
