Raghunandan Rao
Politics

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బులు పంచాడని ఆరోపించారు. ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని సీఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఓటర్లు ప్రలోభపెట్టారని, ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బు ఎన్వలప్‌లో పంపిణీ చేశారని ఆరోపించారు. బూత్‌ల వారీగా లెక్కలు కట్టి మరీ ఒక్కో గ్రామానికి డబ్బులు పంపించారని పేర్కొన్నారు.

ఇలా డబ్బులు సరఫరా చేయడానికి 20 కార్లను వినియోగించుకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, వారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. 20 కార్లలో ఒక్క కారును చేగుంట ఎస్ఐ పట్టుకున్నారని, అందులో రూ. 84 లక్షలు పట్టుబడ్డాయని వివరించారు. ఆ డబ్బులు 27 పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేసే డబ్బులని పేర్కొన్నారు.

Also Read: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారని పోలీసులు అనుకుంటున్నట్టు ఉన్నదని రఘునందన్ రావు తెలిపారు. తన ఫిర్యాదులను తుంగలో తొక్కారని అన్నారు. ఇక్కడ చర్యలు తీసుకోకపోతే.. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుపై నమోదైన కేసులో ఏ5గా వెంకట్రామిరెడ్డి పేరు ఉన్నదని వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలని పేర్కొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు