Priyanka Chopra: బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా బీచ్‌లో మెరిసి హాట్ హాట్ గా కనిపించారు. తాజాగా తన 43 వ పుట్టిన రోజును తన భర్త, కుమార్తెతో కలిసి జరుపుకున్నారు. బీచ్‌లో ఆమె గడిపిన క్షణాలను దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఇస్టాగ్రమ్ ద్వారా పంచుకున్నారు. ‘నేను నా జీవితంలో మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నా మనసంతా కృతజ్ఞతలతో నిండి ఉంది. ఈ విశ్వం నాకు ఇచ్చిన రక్షణకు, అనేక వరాలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా కుటుంబం నా జీవితంలో లభించిన గొప్ప వరం. ప్రపంచ వ్యాప్తంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 43వ ఏటిలోకి అడుగుపెడుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. నలభై మూడులో కూడా ఇంకా యంగ్ గానే ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read also- Fish Venkat: నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వయసు గ్యాప్ పై విమర్శలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఇద్దరూ తమ బంధాన్ని ప్రేమతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరికి మల్తీ మేరీ చోప్రా జోనస్ అనే కుమార్తె ఉంది. తాజాగా నిక్ జోనస్ తన భార్య ప్రియాంకతో బీచ్ లో ఉన్న ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో నిక్ ముందుగా ‘ఆమె లేకుండా’ అనే ఎమోజీతో పోస్టు చేశాడు. అనంతరం ప్రియాంక పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని లిప్‌లాక్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇవేం చేష్టలు అంటుంటే.. మరి కొందరు తప్పేంటి అంటున్నారు.
Read also- Congress Government: రేవంత్ సర్కార్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత.. జహీరాబాద్ లో మహిళా శక్తి సంబరాలు
కోలీవుడ్ లో తన సినీ ప్రయాణం ప్రారంభించి హాలీవుడ్ వరకూ వెళ్లారు ప్రియాంక. 2000లో మిస్ వరల్డ్‌గా కిరీటం అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో ‘అందాజ్’, ‘డాన్’, ‘ఫ్యాషన్’, ‘బర్ఫీ’, వంటి సినిమాల్లో నటించి సీనీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోగలిగింది. కాగా ‘ఫ్యాషన్’ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకొని తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఆ తర్వాత అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ తో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ‘బేవాచ్’, ‘ఇజ్ ఇంట్ ఇట్ రొమాంటిక్’, ‘టెక్స్ట్ ఫర్ యు’ లాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబి 29 (SSMB29) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.