Hari Hara Veera Mallu
ఎంటర్‌టైన్మెంట్

Hari Hara Veera Mallu: వీరమల్లుకు సెన్సార్ షాక్.. ఆ వాయిస్ లేపేశారా?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి.. ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది. ఈసారి పక్కాగా సినిమా వస్తుందనేలా చెబుతూ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడంతో.. ఈసారి అభిమానులు కూడా ధైర్యంగానే ఉన్నారు. కచ్చితంగా జూలై 24న వస్తుందనే నమ్మకం వచ్చేయడంతో.. ఫ్యాన్స్ హడావుడి కూడా మొదలైంది. బస్తాల్లో పేపర్లు, కటౌట్లు, పాలాభిషేకాలకు కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసుకుంటున్నారు. ఈ సందడి ఇలా ఉంటే, సెన్సార్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే ఓ అంశం మిస్ అయినట్లుగా తెలుస్తుంది.

Also Read- Senior Heroine: రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టేవారు.. క్యాస్టింగ్ కౌచ్‌పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి చెప్పించుకున్న వాయిస్ ఓవర్‌.. సినిమాలో సెన్సార్ వారు కట్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అర్జున్ దాస్ వాయిస్‌ని కావాలని మరీ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పించుకున్నారు. ఆ వాయిస్ ఓవర్‌తో వచ్చే మాటలు సినిమాలో ఉండవని తెలుస్తుంది. మొత్తం సెన్సార్ నుంచి 24 సెకన్లు కట్స్ రాగా, ఆ ప్లేస్‌లో 34 సెకన్ల కొత్త ఫుటేజ్‌ని యాడ్ చేసినట్లుగా సెన్సార్ డిటైల్స్ చెబుతున్నాయి. ఆ యాడ్ చేసిన 34 సెకన్లతో మొత్తం ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికేట్ లభించింది. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో పాటు, టెంపుల్ గేట్‌ని తన్నే ఓ సన్నివేశానికి, గర్భిణీ స్త్రీపై వచ్చే ఓ సన్నివేశానికి సెన్సార్ కట్స్ పడ్డాయి. అర్జున్ దాస్ వాయిస్‌కి సంబంధించి 10 సెకన్ల వరకు కట్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్‌కే కాదు, ఫ్యాన్స్‌కు కూడా షాకింగ్ విషయమనే చెప్పుకోవాలి.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!

మరోవైపు సెన్సార్ నుంచి ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయని, బ్లాక్‌బస్టర్ లోడింగ్ అనేలా పాజిటివ్ స్పందన రావడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. రెండు పార్ట్‌లుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండో పార్ట్‌కి సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తయినట్లుగా ఇటీవల చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపింది. కొన్ని రీమేక్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈసారి బాక్సాఫీస్‌ని షేకాడిస్తామనే ధీమాని వారు వ్యక్తం చేస్తున్నారు. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే మాత్రం జూలై 24 వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!