Congress Government: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, రాష్ట్ర పారిశ్రమిక అభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం శెట్కార్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ రాజకీయాల్లోనూ రాణించాలని రేవంత్ సర్కార్ ఆశిస్తుందని గుర్తు చేశారు.
Also Read: Kota And Babu Mohan: నాకు కూడా కోటన్న లాంటి చావే రావాలని దేవుడ్ని కోరుకుంటా.. బాబు మోహన్
జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో 50 శాతం.. అసెంబ్లీ లోను 33 శాతం రిజర్వేషన్లకు ఇప్పటికే ఆమోదము లభించిందని చెప్పారు. పార్లమెంటులోనూ మహిళలకు ఎంపీలుగా 33 శాతం రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్నాయని ఎంపీ సురేష్ శెట్కార్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డి లేని రుణాలు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న వడ్డీ, భీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ జ్యోతి, అడిషనల్ పీడీ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ ముక్, మెప్మా టీఎంసీ బసంత్ రెడ్డి, ఎంపీ కార్యాలయ ఇంచార్జి శుక్లవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.