Media Academy Program: జర్నలిస్ట్ లు, రాజకీయ నాయకులకు నిరంతరం నేర్చుకోవడం ముఖ్యమని మాజీమంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అన్నారు. జర్నలిస్ట్ లు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.నేర్చుకోవడం ద్వారా తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణప్రభుత్వ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విలేకరులకు పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించగా, అతిథులుగా స్థానిక శాసన సభ్యుడు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు, (Harish Rao) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు (Venkateswara Rao) పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల కో-ఆర్డినేటర్ గా సీనియర్ జర్నలిస్ట్ కె.రంగాచారి వ్యవహరించారు. సుప్రసిద్ధ పాత్రికేయులు ఆర్.దిలీప్ రెడ్డి (సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్), ఆర్.వి.రామారావు (విశాలాంద్ర పత్రికా ఎడిటర్), మార్కండేయ (దిశ పత్రికా ఎడిటర్) లు మోడరేటర్స్ గా హాజరయ్యారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. వాటిని అధిగమిస్తూ జర్నలిస్టులు నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు. నేటికీ తనకు ప్రతిదీ నేర్చుకునే అలవాటు ఉందన్నారు.
Also Read: Gram Panchayat: పంచాయతీల్లో నకిలీ వేతన చెల్లింపులకు చెక్!
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ నాయకులకి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడదారి పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్ట్ లు కృషి చేయాలని చెప్పారు.ఇండ్ల మీద అప్పులు తీసుకొని ఆర్థికంగా నష్టపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. సామాజిక అంశాలపై జర్నలిస్ట్ లు దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వాన్ని కదిలించే వార్తల పై జర్నలిస్ట్ లు దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్ట్ లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. సిద్దిపేట జర్నలిస్ట్ లకు తన సొంత డబ్బులతో 10లక్షల రూపాయల భీమా సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పారు.
జర్నలిజంలో విప్లవాత్మకమైన మార్పులు ..ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి
ఆధునిక యుగం జర్నలిజం లో చరిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయని మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.వార్త సేకరణలో సామాజిక ప్రభావం,అంశాలుపూర్తిగా కొత్త రూపం దాల్చాయనితెలిపారు.సాంకేతికతను సమగ్రంగాటేలుకుంటే వార్తల సేకరణ సులభం అవుతుందన్నారు.పాఠకులవ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వార్తలు ఉండాలని,తెలుగు వార్తలను సులువైన భాష లో వ్రాయాలని సూచించారు.త్వరలోనే A I అనే అంశంపై సెమినార్ వర్కు షాప్ చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సోషల్ మీడియాలో చాలాకాలం నుండి బోగస్ ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
జర్నలిస్ట్ లు విద్యార్థుల వలె తరగతులు వినాలి టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ
ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ మాట్లాడుతూ.. 25ఏండ్ల క్రితం జర్నలిస్ట్ ల శిక్షణ తరగతులు జరిగాయని, మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ రెండు రోజుల పాటు జర్నలిస్ట్ లు విద్యార్థుల వలె తరగతులు వినాలన్నారు. మీడియా రంగంలో రోజు రోజుకు మార్పులు వస్తున్నాయన్నారు. జర్నలిస్ట్ లు నిత్య విద్యార్థుల వలె ఉండాలని, ఒకప్పుడు జర్నలిస్టులను గ్రామాలలో న్యాయమూర్తిలాగా భావించేవారని, కానీ ప్రస్తుత తరుణంలో జర్నలిస్ట్ లను చులకన భావంతో చూస్తున్నారన్నారు. జర్నలిస్ట్ లు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Also Read: GHMC Award: తెలంగాణలో స్వచ్ఛ షహర్‌గా గ్రేటర్ హైదరాబాద్