Song release: ‘తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా’ ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటే పొరపాటే. ఇది సినిమా పేరు ఇందులో నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్నారు. చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు వెంకటేష్ వీరవరపు దర్శకత్వం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నాన్నకు ప్రేమతో అనే పాటను నిర్మాతలు విడుదల చేశారు.
Read also- Star Actress: ముందు వాటిని పెంచు.. అవకాశాలు వస్తాయి.. ఎన్టీఆర్ హీరోయిన్ కి ఘోర అవమానం?
దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ.. ‘‘తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా’ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈ రోజు ముఖ్యంగా మా సంగీత దర్శకులు అజయ్ పట్నాయక్ నటించిన ‘నాన్న నీకు ప్రేమతో’ అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా చాలా వరకూ పూర్తయిందనే చెప్పాలి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తామని’ దర్శకుడు అన్నారు. నిర్మాత శరత్ బాబు మాట్లాడుతూ.. ‘తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా’ సినిమా పేరులో గుర్తులేదు ఉంది గానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్ తో సినిమా నిర్మిస్తున్నాం. ఫస్ట్ చిత్రంతోనే ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తామని నమ్మకంతో ఉన్నాం.’ అని అన్నారు.
ఈ సినిమాకు చెన్నా క్రియేషన్స్ బేనర్ పై నిర్మాత శరత్ చెన్నా ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నారు. వెంకటేష్ వీరవరపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ పట్నాయక్ సంగీతం అందించగా అభిలాష్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, జెమిని సురేష్, భరద్వాజ్, ఖయ్యూం, సునీల్ రావి నూతల తదితరులు ప్రధాన పాత్రధారులుగా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాన్న నీకు ప్రేమతో సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంది. సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఈ పాటను కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు