Mallika Sherawat
ఎంటర్‌టైన్మెంట్

Senior Heroine: రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టేవారు.. క్యాస్టింగ్ కౌచ్‌పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Senior Heroine: ఇండస్ట్రీ ఏదైనా వేధింపులు సహజం అనేలా మారిపోతుంది రోజురోజుకీ పరిస్థితి. గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో అందరూ ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీని వేలెత్తి చూపిస్తున్నారు కానీ, ప్రతి ఇండస్ట్రీలో లేడీస్‌పై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. రోజూ న్యూస్ పేపర్స్‌లో అవి దర్శనమిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరించినా, ఏదో చోట వేధింపుల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చే సరికి, ‘మీటూ’ అంటూ ఎన్ని ఉద్యమాలు వచ్చినా.. జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక హీరోయిన్.. తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను చెబుతూనే ఉన్నారు. అయినా ఏది ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!

మల్లికా షెరావత్ పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ తను. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ వీడియోలతో కాకరేపుతుంటుంది. ఆమెకు బోల్డ్ బ్యూటీ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ, నటనపరంగా మాత్రం తనదైన మార్క్‌ని ప్రదర్శించి అగ్ర కథానాయికగా వెలుగొందింది. ప్రస్తుతం ఆమె సినిమాలేమీ చేయడం లేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం యోగ, కసరత్తులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్‌ (casting couch) పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తలలో హైలైట్ అవుతోంది. ఇంతకీ మల్లికా షెరావత్ ఏం చెప్పుకొచ్చిందంటే..

Also Read- Balayya vs Pawan: బాలయ్య, పవన్‌ల మధ్య వార్ తప్పదా? టాలీవుడ్ టాకేంటి?

‘‘ప్రస్తుతం నాకు ఇండస్ట్రీలో అవకాశాలు లేవు. అందుకు కారణం చాలా మంది హీరోలు అడిగిన కమిట్‌మెంట్స్ నేను ఇవ్వకపోవడం వల్లే. అప్పట్లో హీరోలు కొందరు రాత్రికి రమ్మని అడిగేవారు. ఎందుకు రాత్రికి రమ్మంటున్నారు. నేను బోల్డ్ పాత్రల్లో మాత్రమే నటించాను. నా క్యారెక్టర్‌ని చంపుకుని ఆ హీరోలు చెప్పినట్లు ఎందుకు వినాలి? అని నాకు నేనుగా ప్రశ్నించుకున్నాను. ఇందులో చాలా మంది పెద్ద హీరోలు కూడా ఉన్నారు. వారి పేర్లు చెప్పను కానీ, వారితో రాత్రి గడపనందుకే నాకు అవకాశాలు రాకుండా చేశారు. ఎందుకు రాత్రికి రావాలి? అని చాలా మందిని వెంటనే తిరిగి ప్రశ్నించాను కూడా. నేను ఎక్కువగా బోల్డ్ పాత్రలు చేసి ఉండవచ్చు. కానీ, అదే నా క్యారెక్టర్ అనుకునేవాళ్లు. అందుకే బాగా ఇబ్బంది పెట్టేవారు. నేను ఆ టైపు కాదని చెప్పినందుకే.. నన్ను ఇండస్ట్రీకి దూరం చేశారు. కేవలం క్యాస్టింగ్ కౌచ్‌కు ఓకే అని చెప్పనందువల్లే.. నేనిప్పుడిలా ఉండిపోయాను. నా అభిప్రాయాలను గౌరవించిన వారితోనే సినిమాలు చేశాను తప్పితే.. క్యారెక్టర్ వదులుకోలేదు. అలా అని, నాతో పాటు ఉన్న వారు అందుకు అంగీకరించారని నేను చెప్పడం లేదు. కాకపోతే, నేను చేసిన పాత్రలు చూసి నన్ను జడ్జ్ చేయడమే నాకు నచ్చేది కాదు’’ అని మల్లికా షెరావత్ (mallika sherawat) వెల్లడించింది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?