actress ( image source:X)
ఎంటర్‌టైన్మెంట్

Actress: అయ్యో పాపం.. పాపులర్ నటి ఇలా అయిపోయిందేంటి?

Actress: ప్రతి నిత్యం రోడ్లపై ఎందరో అడుక్కుంటూ కనిపిస్తుంటారు. వారందరిలోనూ మనకు తెలియని ఏదో అంతరంగం ఉంటుంది. అయితే మనం మాత్రం వాటి గురించి కనీసం పట్టించుకోం. వారు చెప్పేది వింటే పిచ్చిపట్టి మాట్లాడుతున్నారులే అని కొట్టిపడేస్తాం. ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్‌‌లో జరిగింది. రోజూ రోడ్లపై తిరుగుతున్న ఒకామె వర్షం పడటంతో పక్కనే ఉన్న బస్ షెల్టర్ లోకి వెళ్లింది. ఆమె అక్కడే తరచుగా తలదాచుకుంటుంది. అయితే వర్షం బాగా పడటంతో కొంతమంది ఆ షెల్టర్ లోకి వెళ్లారు. అందులో ఉన్న ఓ మహిళ.. వచ్చీ రాని ఇంగ్లీషులో బెంగాలీ మిక్స్ చేసి ‘నేను ఒక నటిని, నేను ఒక నటిని’ అంటూ అరుస్తుంది. ఆమె వద్ద ఒక పెన్ను, పేపర్ కూడా ఉన్నాయి. ఆమె గట్టిగా అరుస్తున్నా అక్కడ ఉన్నవారు మాత్రం ఆమెను పట్టించుకోలేదు. చాలా సేపటికి ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి నీ పేరు ఏమిటి అని అడిగాడు.

Read also- Hyderabad Heavy Rains: నగరంలో భారీ వర్షం .. ట్రాఫిక్‌తో వాహనదారుల ఇక్కట్లు

దానికి ‘ఆమె నేను ఒక నటిని నా పేరు సుమీ హర్ చౌదరి’ అని చెప్పింది. సరే అది నిజం కాదులే అనుకుని, ఆమెను నమ్మించడానికి సుమీ హర్ చౌదరి(Sumi Har Chowdhury) పోటో‌ను నెట్ లో సెర్చ్ చేశాడు. ఇంటర్నెట్ లో వచ్చిన దానిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్య పోయాడు. ఆమె నిజంగానే సుమీ హర్ చౌదరి. దీంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలపగా.. వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అయితే ఆమె చెప్పిన వివరాల్లో కొన్ని మాత్రం తప్పుగా ఉండటంతో ఆమెకు మతి స్థిమితం సరిగాలేదని పోలీసులు నిర్ధారించారు. సుమీ హర్ చౌదరి ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉంచారు. ఆమె బంధువుల కోసం ఎదురుచూస్తున్నారు.

Read also- Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో

సుమీ హర్ చౌదరి ‘ద్వితీయో పురుష్’, ‘ఖాషి కథా’, ‘ఖాషీ కథ: ఎ గోట్ సాగా’, వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘రూప్‌సాగరే మోనేర్ మానుష్’, ‘తుమీ ఆషే పాషే థాక్లే’ వంటి సీరియల్స్ కూడా నటించి బుల్లితెరపై కూడా గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్ళ క్రితం అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇదే సమయంలో సుమీ హర్ చౌదరి మతిస్థిమితం కూడా కోల్పోవడం జరిగింది. సడన్‌గా ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలియని ఆమె కుటుంబ సభ్యుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇచ్చారు. ఎంత గాలించినా ఆమె పోలీసులకు దొరకలేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె ను చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. మరలా ఆమె మామోలు మనిషి కావాలని అభిమానులు కోరుకుంటుననారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ