Balayya vs Pawan: 2025, సెప్టెంబర్ 25.. ఈ తేదీ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుందా? అంటే.. అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే, అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ఓజీ’ విడుదలకాబోతుంది. అలాగే నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘అఖండ 2’ చిత్రం కూడా అదే రోజు విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల క్లాష్‌పై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇందులో బాలయ్య ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 18కి వాయిదా పడిందనేలా ఒకవైపు వార్తలు వస్తుంటే, మరో వైపు.. అదేం లేదు.. బరిలోకి దిగేందుకు సింహం సిద్ధమవుతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సెప్టెంబర్ 25కు ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read- Anasuya: అలా చేయడం మంచిదే అయింది.. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నా
బీభత్సమైన క్రేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలలో ఒక సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu).. జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పవన కళ్యాణ్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో ఇందులో కనిపిస్తున్నారు. అయినా సరే.. అందరూ ఆయన చేస్తున్న మరో చిత్రం ‘ఓజీ’ (OG) కోసమే వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. కారణం ‘ఓజీ’కి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అలాంటి క్రేజ్‌కు కారణమైంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓ పొలిటికల్ సభలో ‘ఓజీ’ చూద్దురుగానీ, చాలా బాగుంటుంది అని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆశలన్నీ ‘ఓజీ’పైనే ఉన్నాయి. ఈ సినిమా కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్‌తో మరో సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
హ్యాట్రిక్ కాంబో తర్వాత వస్తున్న చిత్రం
ఇక బాలయ్య ‘అఖండ 2’ (Akhanda 2) విషయానికి వస్తే.. ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల వచ్చిన టీజర్ అయితే.. బాలయ్య మరోసారి బీభత్సం సృష్టించబోతున్నాడనే హింట్ ఇచ్చేసింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బోయపాటి పెద్దగా టైమ్ తీసుకోడు కాబట్టి కచ్చితంగా సెప్టెంబర్ 25కు వచ్చే అవకాశాలే ఎక్కువ.
రెండు సినిమాలు వస్తే ఏమవుతుంది?
సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్నాయి. అప్పుడు లేని ఇబ్బంది.. ఇప్పుడేముంటుంది? అని కొందరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఇప్పుడో ప్రాబ్లమ్ ఉంది. ప్రజంట్ సినిమా విడుదలై థియేటర్లలో ఒక వారం గట్టిగా నిలబడే పరిస్థితులు లేవు. అందులోనూ ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఒకే రోజు వస్తే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఇద్దరూ హీరోలకు మంచిది కాదు. అందుకే, వీరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గి.. ఒక వారం అటు, ఇటుగా వస్తే బాగుంటుందని టాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. ఆ నిర్ణయమే కరెక్ట్ అంటూ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. పోటీలకు పోకుండా, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని.. మంచి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ పోటీపై చర్చలు నడుస్తున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు