Anasuya: తెలుగు టీవీ షోలలో బాగా పాపులర్ అయిన షో ఏది అంటే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. ఒకప్పుడు ఈ షో ఏ రేంజ్లో పాపులర్ అయిందో తెలిసిందే. ఆ షో వల్ల ఎందరో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం వారందరూ చేతినిండా సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు. అంతటి పాపులర్ షో ఇప్పుడు ఆదరణ కోల్పోయింది. ఒకప్పుడు హాస్యానికి పెట్టింది పేరుగా జరిగే షోలో ఇప్పుడు అంతా డబుల్ మీనింగ్ డైలాగులు, ప్రాసలు, వల్గారిటీ మీద నడుస్తుంది. ఈ విషయాలు ఎవరో చెప్పినవి కాదు ఎన్నో సంవత్సరాలు ఆ షోకి హోస్టుగా చేసిన వారే చెబుతున్నారు. తాజాగా దీనిపై యాంకర్, నటి అనసూయ స్పందించారు. తాను ఏ పరిస్థితుల్లో జబర్దస్త్ వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చిందో.. దానికి గల కారణాలు ఏమిటో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read also- Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల నీటి వివాదం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జబర్దస్త్ షో 12 ఏళ్లు పూర్తియిన సందర్భంగా వేడుక నిర్వహించారు. అక్కడకు అనసూయ (Anasuya), నాగబాబు, హైపర్ ఆది లాంటివాళ్లు అందరూ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అనసూయ హైపర్ ఆది మధ్య జరిగిన కొన్ని సంభాషణలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ షోలో అందరూ సరదాగా మాట్లాడుతున్న సమయంలో అనసూయ హైపర్ ఆదిని చూపిస్తూ.. నీ వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్లిపోయాను అన్నారు. వెళ్ళేముందు కూడా చాలా బతిమాలా కానీ నువ్వు వినలేదు అని అన్నారు. దానికి హైపర్ ఆది నువ్వు అమెరికా వెళ్లిపోయినపుడు కూడా నెను నీకు లింకులు పంపాను అదీ మనిద్దరికీ మధ్య ఉన్న లింకు అన్నారు. కోపంతో ఊగిపోయిన అనసూయ.. అలాంటి మాటలు నిజ జీవితాల్లో చాలా లోతుగా వెళతాయతీ ఆదీపై ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు జబర్దస్త్ లో పంచులతో అందరినీ అలరించిన హైపర్ ఆది ఆ షో అవసరాల కోసం వాటి డోస్ పెంచాల్సి వచ్చింది. దానివల్ల చాలా వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు ఆది. అలాంటి పంచులే అనసూయపై కూడా వేయడంతో ఆమె చాలా సందర్భాల్లో బాధ పడ్డారు. ఆ సమయంలో షో కమిట్‌మెంట్ కోసం అవన్నీ పట్టించుకోలేదు. కానీ అవన్నీ తన పర్సనల్ లైఫ్ల్ లో చాలా ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చారు. హైపర్ ఆది ఇప్పటికీ మారకపోవడంతో అనసూయ ఫ్యాన్స్ ఆదిపై ఫైర్ అవుతున్నారు. ప్రతిసారీ అలా అనడం భావ్యం కాదంటున్నారు. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయని, అవి దాటకుండా ఏమైనా చెయ్యవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు