Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు అన్నారు. నిజాం కాలేజీలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లింగ సమానత్వం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు వివరించారు.
Also Read: Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో
రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ప్రకటించగానే, ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయని, కానీ తమ ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతూ మొదటి ఏడాదిలో రూ. 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలను రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఐదు సంవత్సరాల కాలంలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలోని మహిళల చేతిలో లావాదేవీలు జరిగితే, ఆర్థిక స్వాతంత్ర్యంతోనే లింగ సమానత్వం సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మూలం నుంచి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు.
Also Read: Kota And Babu Mohan: కోటన్న కోసం అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లును కూడా వదులుకున్నా.. బాబు మోహన్