Kota And Babu Mohan: కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ఇద్దరూ వెండి తెర మీద కనిపిస్తే చాలు.. చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. తెలుగు సినిమా పరిశ్రమలో వీరిద్దరూ ఒక ఐకానిక్ జోడీ. వీరి కామెడీ కెమిస్ట్రీ తెలుగు ఆడియెన్స్ ను నవ్వించి, గుర్తుండిపోయే సన్నివేశాలను ఎన్నో అందించారు. అయితే, కోట శ్రీనువాసరావు అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఆయనను గుర్తు చేసుకుంటూ. బాబు మోహన్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
ఇద్దరం ఒకే ప్లేట్‌లో భోజనం చేసేవాళ్లం..
కోట శ్రీనివాసరావు మరణం తర్వాత బాబు మోహన్ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడారు. “శనివారం రాత్రి కూడా కోటన్నతో మాట్లాడాను. ఆయన ఇంటికి వెళదామనుకున్నా, కానీ అంతలోనే ఆయన చనిపోయారని తెలిసింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆయన నాకు సొంత అన్నలాంటి వాడు. ఒకే ప్లేట్‌లో భోజనం చేసేవాళ్లం, చిన్న పిల్లాడికి తినిపించినట్లు నాకు కూడా అలాగే తినిపించేవాడు” అని ఎమోషనల్ అవుతూ చెప్పాడు.
Also Read: Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!
కోటన్న కోసం ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా వదులుకున్నా.. బాబు మోహన్
ఆయన ఇంకా మాట్లాడుతూ ” నేను ఒక ఇల్లు తీసుకున్నాను. అయితే, 5 రోజుల తర్వాత కోటన్న ఏరా అప్పుడే ఇల్లు కొన్నావా? అడ్వాన్స్ కూడా ఇచ్చావంట కదా అని అడిగాడు. ఆయన ఎప్పుడూ అంతే.. సైటైర్లు వేస్తూనే ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా ఆయనకు అనవసరం.. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. అవును నేను ఇల్లుకి ఇచ్చాను అవును అని అన్నాను. అప్పుడు ఆయన వెంటనే మాకు ఇవ్వొచ్చు గా.. అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా.. సరే తీసుకో అని అన్నాను. నేను వెంటనే వాళ్ళకి చెప్పి , అడ్వాన్స్ అలాగే ఉంచండి. నా పేరు బదులు కోటన్న పేరు రాయండని అవి కూడా తీసుకోలేదు. అంతే కోటన్న ఇల్లుకి నేను అడ్వాన్స్ ఇచ్చినట్లు. అప్పుడు అలా ఆయన అడిగింది చేశా.. నేనేమో ఆ ఇంటికి పక్కన చిన్నది దొరికితే వేరేది తీసుకున్నా ” అని చెప్పాడు.
Also Read: PM Dhan Dhanya Krishi Yojana: పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం.. ప్రతి ఏటా రూ.24వేల కోట్లు