GHMC (imagecredit:twitter)
తెలంగాణ

GHMC: త్వరలో జీహెచ్ఎంసీలో యాక్షన్ ప్లాన్.. స్పెషల్ టీమ్‌లతో దాడులు

GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యావరణానికి, మానవాళికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి దృష్టి సారించనుంది. యుద్ధ ప్రాదిపదికన ఫీల్డ్ లెవెల్‌లో యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇప్పటికే 40 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నా, ఎక్కడా కూడా ఆ నిబంధన అమలు కాకపోవడంతో జీహెచ్ఎంసీ(GHMC) మరోసారి ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా జీహెచ్ఎంసీ హెల్త్, శానిటేషన్ విభాగం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

15 ఏళ్ల కిత్రమే నిషేధం.. కానీ
దాదాపు 15 ఏళ్ల క్రితం ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ(GHMC) ఆ తర్వాత అడపాదడపా దాడులు నిర్వహించి, 40 మైక్రాన్లు మించిన ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న వ్యాపార సంస్థలకు జరిమానాలు విధించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ప్లాస్టిక్(Plastic) నిషేధాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ప్రధాన కార్యాలయంలోని ఏడు అంతస్తుల్లో ఎక్కడా కూడా ప్లాస్టిక్ కవర్లు గానీ, బాటిల్స్(Botils) గానీ వినియోగించుకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: Indira Mahila Shakti Vijayotsavam: ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సంబురాల ఏర్పాట్లు

దీనికి తోడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలోని ఏడు అంతస్తుల్లోనూ అన్ని విభాగాల్లో, విభాగాల వారీగా రాంకీ సస్టైనబుల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి అంతస్తులో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ యంత్రాలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ కవర్ల వినియోగంపైనున్న నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా త్వరలోనే స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగి దాడులు నిర్వహించనున్నట్లు సమాచారం.

విచ్చలవిడిగా వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా, నాటి నుంటి నేటి వరకు పాతబస్తీలో వినియోగం యథావిధిగా కొనసాగుతున్నది. నాలాలు, రోడ్లపై, మరమ్మతుల కోసం డ్రైనేజీలు తెరిచినప్పుడు కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ బయట పడుతున్నాయంటే సిటీలో ఏ తరహాలో వినియోగం జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. పాతబస్తీతో పాటు మొత్తం గ్రేటర్ పరిధిలో మిర్చీ బండి మొదలుకుని బిర్యానీ హోటళ్లలో కూడా నిషేధిక ప్లాస్టిక్ కవర్ల వినియోగం బాగా పెరిగింది. అంతెందుకు టీ, కాఫీలను సైతం ప్లాస్టిక్ కవర్లలో పార్శిల్ చేసి ఇస్తున్నట్లు గుర్తించిన అధికారులు వినియోగాన్ని కట్టడి చేసే దిశగా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్(Plastic) వినియోగానికి ఇప్పటికైనా కట్టడి చేయని పక్షంలో పర్యావరణ, మానవాళి పరిరక్షణకు సమస్య తలెత్తుతుందని దీన్ని పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీపై హాటళ్లు(Hotels), బేకరీలు, మెస్‌లు, స్వీట్ షాపులపై దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు త్వరలోనే ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కూడా దృష్టి సారించి, దాడులు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.

Also Read: BC Reservation Bill: గవర్నర్ బీసీ రిజర్వేషన్లపై గెజిట్ జారీ చేయాలి.. కవిత డిమాండ్

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు