HCA Scam: హెచ్‌సీఏలో జరిగిన కోట్లాది రూపాయల గోల్‌మాల్‌లో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర కూడా ఉందంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association)అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ(Yendala Lakshminarayana), ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డిలు సీఐడీకి ఫిర్యాదు ఇచ్చారు. వీరితోపాటు హెచ్‌సీఏ మాజీ డైరెక్టర్‌తోపాటు మరికొందరి హస్తం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్‌సీఏలోకి ఎంట్రీ
డీసీపీ కార్యాలయానికి వచ్చిన ఇద్దరు, సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హాకు ఫిర్యాదును అందచేశారు. హెచ్‌సీఏ(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావు(Jaganmohan Rao) మరికొందరితో కలిసి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెటర్లను ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బు వసూలు చేశారని తెలిపారు. నిజానికి జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్ల సహాయంతో హెచ్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చారని తెలియచేశారు. ఇక, ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పెద్ద సంఖ్యలో టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టుగా పేర్కొన్నారు.
ఈ అంశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారన్నారు. హెచ్‌సీఏ అకౌంట్‌ను కూడా తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండానే ఎన్నో పనులు చేయించామంటూ కోట్లాది రూపాయలు స్వాహా చేశారని తెలిపారు. పలువురు క్రికెటర్ల కెరియర్‌తో ఆటలాడుకున్నారని పేర్కొన్నారు. క్రికెట్అభివృద్ధి కోసం గ్రాంట్స్ రూపంలో బీసీసీఐ నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. ఐపీఎల్ నుంచి వచ్చిన షేర్ మనీని కూడా స్వాహా చేశారన్నారు.
పదేళ్లలో..
గడిచిన పదేళ్లలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు 500 నుంచి 600 కోట్ల రూపాయలు వచ్చాయని ఫిర్యాదులో తెలియచేశారు. ఇంత భారీ మొత్తంలో నిధులు వచ్చినా క్రికెట్(Cricket) అభివృద్ధి కోసం ఖర్చు చేసింది శూన్యమని తెలిపారు. హైదరాబాద్(Hyderabad)లోగానీ రాష్ట్రంలోగానీ హెచ్‌సీఏ(HCA) కోసం ఎలాంటి ఆస్తులను కూడా కొనలేదన్నారు. అదే సమయంలో హెచ్‌సీఏ బాడీలో ఉన్న సభ్యుల ఆస్తులు మాత్రం ఈ పదేళ్లలో ఊహించనంతగా పెరిగి పోయాయని వివరించారు. ఈ అక్రమాల వెనుక కేటీఆర్, కవితల పాత్ర కూడా ఉన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: BC Reservation Bill: స్థానిక సమరానికి సర్కార్ ప్రిపరేషన్.. ఎన్నికల జాబితా కోరిన ఈసీ
కేటీఆర్ బావ మరిది లింక్స్
ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కోసం కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌడాట్‌కామ్, మేరా ఈవెంట్డాట్కామ్అనే సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలిపారు. ఇక, ఫుడ్ కాంట్రాక్టులను కవిత(Kavitha), కేటీఆర్(KTR)తోపాటు జగన్మోహన్రావు దగ్గరి బంధువులకు చెందిన సురభి క్యాటరింగ్‌కు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ట్రావెల్స్ కాంట్రాక్ట్, హోటల్ బుకింగ్ పనులు కూడా ఇదే బ్యాచ్ చూసినట్టు తెలిపారు. వీటన్నింటిలో హెచ్‌సీఏ మాజీ డైరెక్టర్ వంకా ప్రతాప్ పాత్ర కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో 2019 – 2022 మధ్య జరిగిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. 2017లో జస్టిస్ అనిల్ ధవే, 2023లో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైన వివరాలను పెన్ డ్రైవ్‌ల రూపంలో సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హాకు అందచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యెండల లక్ష్మీనారాయణ, గురవా రెడ్డి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలవగానే జగన్మోహన్ రావు తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావులకు అంకితమంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
ఈడీకి కూడా..
ఇక, హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డిలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టుగా పేర్కొన్నారు. ఇందులో మనీలాండరింగ్ జరిగినట్టు తెలిపారు.
Also Read: Toddy Shops: కల్లు కాంపౌండ్లపై స్పెషల్ డ్రైవ్.. పక్కాగా వివరాలు సేకరించేందుకు ప్లాన్